Advertisement
ఏ సినిమా తెర మీదకి వస్తున్న ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి సినిమాలో నటించే హీరో హీరోయిన్లు ఇతర ఆర్టిస్టులు సినిమా ప్రమోషన్ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. కొన్ని సార్లు ఇతర హీరోల సహాయాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. ఇతర హీరోలని కూడా తీసుకు వచ్చి వారి చేత ప్రమోట్ చేయిస్తారు. ఇటువంటివి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఏ హీరోల ప్రమోషన్స్ కి అయినా పెద్ద పెద్ద హీరోలు వస్తుంటారు.
Advertisement
కానీ టాప్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు మాత్రం ఎటువంటి సినిమా ప్రమోషన్స్ కి రారు. ఇలాంటి వాటిలో మహేష్ పెద్దగా కనపడరు. మరి ఇక ఎందుకు ఆయన ప్రమోషన్స్ వంటి వాటికి రారు అనే విషయానికి వచ్చేస్తే.. ఒకానొక టైం లో అర్జున్ సినిమా రిలీజ్ అయిన టైంలో మహేష్ బాబు చాలా బాధపడ్డారు.
Advertisement
సినిమా రిలీజ్ రోజునే పైరసీ వచ్చింది. దీంతో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు ఈ టైంలో టాలీవుడ్ హీరో కూడా సపోర్ట్ చేయలేదట. పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త ధైర్యం చెప్పారు. అయితే సెలబ్రేషన్ టైం లో అందరూ సంతోషం పంచుకుంటారు కానీ కష్టం వచ్చినప్పుడు తోడు ఎవరు రారని ఫీల్ అయ్యారు మహేష్ బాబు. అందుకే ఇతర హీరోల ఈవెంట్ల కి వెళ్లడం లేదని మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు.
Also read: