Advertisement
మగవారు మరియు స్త్రీలు షర్ట్స్ వేసుకోవడం చాలా కామన్. మగవారితో పోటీపడి మరి ఈ మధ్యకాలంలో స్త్రీలు షర్ట్స్ ధరిస్తున్నారు. చాలా కాలంగా అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు ధరించే దుస్తులలో చొక్కా ఒకభాగం. ఇద్దరి షర్టులు కూడా ఒకేలా ఉంటాయి. కానీ ఇప్పటికీ చిన్న వ్యత్యాసం అబ్బాయిలు, అమ్మాయిల షర్టుల మద్య వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. అది బటన్ వైపు ఉంటుంది. వాస్తవానికి, అబ్బాయిల చొక్కాలకు కుడివైపున బటన్లు ఉంటాయి. కానీ అమ్మాయిలు షర్టులు ఎడమవైపున ఉంటాయి.
Advertisement
ఇప్పుడు అసలు ప్రశ్న ఇక్కడే ఉంది. ప్రతిదీ ఒకేలా ఉన్న తర్వాత కూడా, బటన్లు వేరువేరుగా ఎందుకు ఉంటాయి. మహిళల చొక్కాల బటన్లు ఎడమవైపున ఉండేందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఫ్యాషన్ రంగానికి చెందిన డిజైనర్లు అందించిన సమాచారం ప్రకారం, తల్లి పాలు ఇవ్వడంలో మహిళలు తరచుగా పిల్లలను ఎడమవైపు ఉంచడం కూడా ఒక కారణం కావచ్చు. ఎడమవైపున ఉన్న బటన్ ను తెరవడం, ముసివేయడం వారికి ఈజీగా ఉంటుంది.
Advertisement
అదే సమయంలో, దీనికి 13వ శతాబ్దంలో కూడా సంబంధం ఉంది. నిజానికి ఇది చాలా తక్కువ మంది మాత్రమే చొక్కాలు వేసుకునే కాలం. ఎందుకంటే ఆ సమయంలో చొక్కాకొనడం పెద్ద విషయం. చాలామంది శరీరాన్ని కప్పి ఉంచి బట్టలు మాత్రం కట్టుకొని పనిచేసేవారు. మరోవైపు, చుక్కలు ధరించే మహిళలు పెద్ద ఇల్లు, రాజ ప్రస్థానంకు చెందిన కుటుంబాల వారు ఉండేవారు. వారి వెంట దాసీలు ఉండేవారు. చొక్కాలు ధరించిన మహిళలు ఎడమవైపు బట్టన్ లను మూసివేయడం, వారి దాసులకు చాలా ఈజీ, కాబట్టి ఎడమవైపు బటన్ ను కుట్టడం మొదలుపెట్టారు. ఇది అప్పటినుంచి ఇప్పటివరకు కొనసాగుతోంది. అదే సమయంలో పురుషులు స్వయంగా బట్టలు వేసుకునేవారు. అందువల్ల వారు బటన్లను పెట్టుకునేవారు. దీంతో రైట్ హ్యాండ్ తో బటన్లను పెట్టుకోవడం వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి పురుషుల చొక్కాలు బటన్లను కుడివైపుకు ఉండటం ప్రారంభించాయి.
Read also: సుందరకాండ అపర్ణ బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె ఎలా మారిపోయిందో తెలుసా..?