Advertisement
ఏ క్రీడాకారులైన వారి దేశ కీర్తిని పెంచడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా వారి చేసే పనులలో ఆ దేశభక్తి కూడా కనబడుతుంది. ముఖ్యంగా క్రికెట్ విషయానికి వస్తే క్రికెట్ ఆడేటువంటి క్రీడాకారులు ఎప్పుడూ కూడా దేశం పై ప్రేమను మరియు అభిమానాన్ని చాటుతూ ఉంటారు. జెర్సీ మరియు హెల్మెట్ వంటి వాటి పై భారత దేశ జెండాను డిస్ప్లే చేస్తారు. అయితే ఎంఎస్ ధోని కూడా అంతే దేశభక్తితో కలిగి ఉంటారు.
Advertisement
కానీ ధోని హెల్మెట్ పై భారతీయ జెండా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. నిజానికి మొదటగా సచిన్ టెండూల్కర్ హెల్మెట్ పై జాతీయ జెండాను డిస్ప్లే చేసుకున్నారు. దానిని ఫాలో అవుతూ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మరియు యువరాజ్ సింగ్ వంటి ప్రముఖ క్రికెటర్లు కూడా వారి హెల్మెట్ పై జాతీయ జెండాను డిస్ప్లే చేసుకున్నారు.
ఎంఎస్ ధోనీకి భారతీయ ఆర్మీ పై చాలా మక్కువ. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాలలో చెప్పారు. ధోని క్రికెటర్ కాకపోతే ఆర్మీ వైపు కెరియర్ ని ఎంపిక చేసుకుంటానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కార్గో ప్రింట్ మిలటరీ అవుట్ ఫిట్స్ ను ఎక్కువగా ఎంఎస్ ధోని ఇష్టపడతారు. ఇండియన్ ఆర్మీ పై చాలా అభిమానం ఉన్న ఈ క్రికెటర్ ఎందుకు జాతీయ జెండాను హెల్మెట్ పై ధరించలేదు అని చాలా మంది ఆలోచించారు.
Advertisement
దాంతో ఒక అభిమాని ధోనీని ఇదే విధంగా ప్రశ్నించారు. ఆట ఆడే సమయంలో వికెట్ కీపింగ్ వంటి సమయంలో హెల్మెట్ ను రక్షణ కోసం ఉపయోగిస్తారు. అయితే కొన్ని సందర్భాలలో రోల్స్ ను మార్చుకోవాల్సి ఉంటుంది.
అలాంటప్పుడు హెల్మెట్ అవసరంలేని సమయంలో కింద పెట్టేస్తూ ఉంటారు. ఈ విధంగా గ్రౌండ్ పై హెల్మెట్ ను వదిలేయవలసి వస్తుంది. అందువల్ల నేను జాతీయ జెండాను హెల్మెట్ పై డిస్ప్లే చేయడానికి ఇష్టపడను అని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఇదే ధోని జాతీయ జెండాను హెల్మెట్ పై డిస్ప్లే చేయక పోవడానికి కారణం.
Also read:
మెగాస్టార్ ఫ్యామిలీతో పెట్టుకుని.. ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయిన నటులు వీళ్ళే..!
విమానాల్లో కిటికీలు ఎందుకు గుండ్రంగా ఉంటాయి..? కారణం ఏమిటి..?
ఆషాఢమాసంలో అత్తా కోడళ్ళు ఎందుకు ఒకే చోట ఉండకూడదు..? కారణం ఏమిటి అంటే..?