Advertisement
Navagrahalu: నవగ్రహాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి శని అలానే రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు మొత్తం తొమ్మిది గ్రహాలు ఉంటాయి. జ్యోతిష్యులు జాతకాలు చెప్పేది ఈ గ్రహాలు ఆధారంగానే. ఈ క్రమంలో ఏమైనా గ్రహదోషాలు ఉన్నట్లయితే కొంతమంది పూజలు చేయించుకుంటూ ఉంటారు. దాని వలన మంచి ఫలితం వస్తుందని భావిస్తారు. ఈ నవగ్రహాలు అనేవి ప్రధానంగా శివాలయాల్లో మనకి కనబడుతూ ఉంటాయి. మరి దాని వెనుక కారణం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి కూడా ఒక్కొక్క అధిష్టాన దేవత అనేది ఉంటుంది. ఆ దేవతలను నియమించింది శివుడు.
Advertisement
Advertisement
అందుకని శివాలయంలో కనబడుతూ ఉంటాయి దీంతో పాటుగా గ్రహాలకి మూలం అయినటువంటి సూర్యదేవుడికి ఆదిదేవుడు కూడా శివుడు ఈ కారణంగా గ్రహాలు శివాలయంలోనే ఉంటాయి. శివాలయాల్లో నవగ్రహమంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. అలానే ఇంకో విషయం ఏంటంటే శివాలయానికి వెళ్ళాక ముందు శివుడిని దర్శనం చేసుకోవాలా..? లేదంటే నవగ్రహాలని దర్శనం చేసుకోవాలా..? ఈ సందేహం చాలా మందిలో ఉంది. మరి ఈ సందేహం నీ ఇప్పుడే క్లియర్ చేసుకోండి. శివాలయాల్లో నవగ్రహాలని చూసిన వెంటనే మొదట పరమశివుడు వద్దకు వెళ్లాలా లేదంటే నవగ్రహాలను చూడాలన్న విషయానికి వస్తే.. పరమశివుడు ఆదిదేవుడు పాలకుడు కర్తవ్యాన్ని బోధించేది పరమేశ్వరుడే ముందు శివుడిని దర్శించుకున్న లేదంటే నవగ్రహాలను దర్శించుకున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు.
శివుడిని ప్రార్థించిన తర్వాత నవగ్రహాలను ప్రార్థిస్తే స్వామిని ముందుగా పూజించినందుకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి. శివాలయం కాకుండా కొన్ని ఇతర ఆలయాల్లో నవగ్రహాలు ఉంటాయి. కానీ ఏ ఆలయంలో నవగ్రహ మండపాలు వున్నా చుట్టు ప్రదక్షణ చేయడం చాలా మంచిది. అలా చేయడం వలన నవగ్రహ దోషాలు అన్నీ కూడా పోతాయి. ఇక మీదట నవగ్రహాలు కనపడితే ఈ విధంగా ఆచరించండి. అలానే శివాలయంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ విషయాలని కచ్చితంగా మర్చిపోకుండా పాటించండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!