Advertisement
సాధారణంగా ఏ రైలు పట్టాల పక్కన చూసిన రాళ్లు కనిపిస్తాయి. ట్రాక్ మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశంలో కూడా కంకర రాళ్లతో నింపివేస్తూ ఉంటారు. అసలు ఈ కంకర రాళ్ళను ట్రాక్ కింద ఎందుకు పోస్తారో తెలుసా.. రైల్ ట్రాక్ కింద లేదా చుట్టూ ఉండే కంకర రాళ్ళను బల్లాస్ట్ అంటారు. అయితే ఇప్పుడంటే ట్రాక్స్ మధ్యలో కాంక్రీట్ దిమ్మలను ఏర్పాటు చేస్తున్నారు కానీ.. ఒకప్పుడు చెక్క దిమ్మలు ఉండేవి. ఈ క్రమంలో కాంక్రీట్ అయిన, చెక్క దిమ్మలైన వాటిని చిత్రంలో ఇచ్చిన విధంగా స్లిపర్స్ తో ఒకదానితో మరొకదాన్ని ఫిట్ చేస్తారు.
Advertisement
Read also: నటుడు రవి ప్రకాష్ సినిమాలలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా..?
Advertisement
దాంతోపాటు పట్టాలకు దిమ్మలను కూడా అమర్చుతారు. ఇలా అమర్చాక పట్టాలు సరైన పొజిషన్లో ఉండేందుకు చుట్టూ, అలాగే కింద కంకర రాళ్ళను పోసి సమంచేస్తారు. దీనివల్ల అవి ఫిక్స్ అయి అటు ఇటు కదలకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల రైలు పట్టాలపై వెళ్తున్న సమయంలో పట్టాల నుండి వచ్చే భారీ శబ్దం కూడా తగ్గుతుంది. ఇదిలా ఉంటే.. మెట్రో రైలు ట్రాక్ పై రాళ్ళని ఎందుకు ఉపయోగించరని ఎప్పుడైనా ఆలోచించారా..? దీనికి కూడా ఒక కారణం ఉంది. మెట్రో రైల్ ట్రాక్ లు ఎప్పుడూ చాలా బిజీగా ఉన్నందున వాటిని మళ్ళీ బ్లాక్ చేయడం సాధ్యం కాదు. అందుకే బ్యాలస్ట్ లేకుండా రూపొందిస్తారు.
మెట్రో ట్రాక్ లు భూమిపైన లేదా భూమికి దిగువన ఉంటాయి. అటువంటి పరిస్థితులలో ఈ ప్రదేశాలలో బ్యాలెస్ట్ ట్రాక్ నిర్వహించడం సాధ్యం కాదు. అంత పైకి రాళ్ళను జారవేయడం కష్టంతో కూడుకున్న పని అయినందువల్ల.. అందుకే మెట్రో ట్రాక్ లను బ్యాలస్ట్ లేకుండా కాంక్రీట్ తో తయారు చేస్తారు. అంతేకాకుండా ట్రాక్ ల వైబ్రేషన్ రాకుండా ఉండడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అయితే వీటి తయారీకి అయ్యే ఖర్చు కాస్త ఎక్కువే అయినప్పటికీ నిర్వహణ వ్యయం చాలా తక్కువ.