Advertisement
ఇటీవల చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం, రిమాండ్ లో ఉంచడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేయడం పై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించారు. కానీ ఈ విషయమై జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఆయన సైలెన్స్ ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ టీడీపీ కార్యక్రమాలన్నిటికి దూరంగానే ఉంటూ వచ్చారు.
Advertisement
అయితే.. కొన్ని సందర్భాలలో తారక్ స్పందించినప్పటికీ కొందరు కావాలనే ఎన్టీఆర్ తీరుని తప్పుబడ్డటం, వివాదాస్పదం చేయడం లాంటివి చేసారు. అందువల్లే తారక్ చంద్రబాబు విషయంలో స్పందించే అవకాశాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ తారక్ స్పందించినప్పటికీ మరికొన్ని కొత్త వివాదాలు వచ్చే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు. ఉన్న వివాదం ముదిరే అవకాశం ఉందని ఎన్టీఆర్ ఫాన్స్ సైతం భావిస్తున్నారు.
Advertisement
మరోవైపు కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టిన తారక్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత తారక్ మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టేసుకున్నారు. ప్రస్తుతం తారక్ దృష్టి అంతా సినిమాలపైనే ఉందని తెలుస్తోంది. రాజకీయాల వైపు ఆయన వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరో వైపు దేవర బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువే అవుతోంది అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.