Advertisement
భారత జట్టులో సంజు శాంసన్ కు సరైన అవకాశాలు రాకపోవడం పై అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలెక్టరులు కావాలని సంజు శాంసన్ విషయంలో వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. సంజు శాంసన్ కంటే కోచ్, కెప్టెన్ రిషబ్ పంత్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సంజు శాంసన్ వన్డేలలో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అతడు బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తోంది. అసలు ఎందుకు శాంసన్ కంటే పంత్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో, ఆ ఐదు కారణాలు ఇదిగో?
Advertisement
పంత్ ‘X’ ఫ్యాక్టర్
పరిస్థితులు ఎలా ఉన్నా? రిషబ్ పంత్ తన దూకుడు బ్యాటింగ్ తో రాజీపడలేదు. క్రీజులోకి రాగానే విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోతాడు. తద్వారా అతడిని కోచ్, కెప్టెన్ ఎల్లప్పుడూ టీం ఇండియా ‘X’ ఫ్యాక్టర్ గా పరిగణిస్తారు.
పంత్ వికెట్ కీపింగ్ నైపుణ్యం
ప్రపంచంలోని అత్యుత్తమమైన వికెట్ కీపర్ కాదు గానీ, అరంగేట్రం చేసిన తర్వాత నుంచి పంత్ తన వికెట్ కీపింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. కాగా, ఇవన్నీ అటు ఉంచితే, సంజు శాంసన్ కూడా వికెట్ కీపర్ ఏనని, అతడికి అవకాశాలు ఇస్తే, చక్కగా రాణించగలుగుతాడని అభిమానులు అంటున్నారు.
ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ గా పంత్ కు ప్రయోజనం
Advertisement
భారత బ్యాటింగ్ ఆర్డర్ లో చాలామంది బ్యాట్స్మెన్లు కుడి చేతితో బ్యాటింగ్ చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో, కెప్టెన్ సరైన జట్టు కాంబినేషన్ కోసం రిషబ్ పంత్ కు ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం ఇస్తాడు. సంజు శాంసన్ రైట్ హ్యాండ్ బ్యాటర్, అదే అతని మైనస్ పాయింట్.
విధ్వంసకర బ్యాటర్
పంత్ 2017 లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. అతడు ఒక విధ్వంసకర బ్యాటర్ గా పేరుగాంచాడు. ఆస్ట్రేలియా పర్యటనలోను పంత్ ఈ విషయాన్ని నిరూపించాడు. మరోవైపు, సంజు శాంసన్ 2015 సంవత్సరంలో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. కానీ అతడి ఫామ్ లేమి కారణంగా టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు.
టెస్టులు కారణంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో అవకాశం?
అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ ఫార్మాట్ టెస్టులు. అందులో రిషబ్ పంత్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ ఎడమ చేతి వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ 31 టెస్టుల్లో 5 సెంచరీలతో 2123 పరుగులు చేశాడు. తక్కువ మ్యాచ్లలోనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పిచ్ లపై పంత్ సెంచరీలు బాదాడు. అలాగే టీమ్ ఇండియాకు విజయాలను అందించడంలో పలు చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ లు ఆడాడు.
ఇవి కూడా చదవండి :