Advertisement
హీరో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై కుదిరితే మద్దతుగా మాట్లాడమని అపహాస్యం మాత్రం చేయొద్దని చెప్పారు. అలా చేస్తే ప్రజలు క్షమించరని అన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుభ్రత కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. మీడియాతో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు కూడా చెప్తున్నాను. హిందూ ధర్మాన్ని రక్షించాలంటే మద్దతుగా నిలవండి అని అన్నారు అపహస్యం చేస్తే ప్రజలు క్షమించరు.
Advertisement
తిరుపతి లడ్డు అనేది బాధతో కూడిన అంశం. దీనిపై జోకులు వేస్తున్నారు రాత్రి ఒక ఫంక్షన్ లో చూసాను. హీరో లడ్డు అనేది సెన్సిటివ్ విషయం నన్ను ఇందులోకి లాగొద్దు అన్నారు దయచేసి అలా మాట్లాడొద్దు. ఓ నటుడుగా మిమ్మల్ని నేను గౌరవిస్తాను సనాతన ధర్మం విషయంలో ఆ మాట అనాలి అంటే వంద సార్లు ఆలోచించాలని ఫైర్ అయ్యారు.
Advertisement
Also read:
ఇలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది కొన్ని మీమ్స్ ని స్క్రీన్ మీద చూపించి కామెంట్ చెప్పమని యాంకర్ ఆయనని అడిగారు. దాన్ని చూసిన కార్తి ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ విషయం ఇప్పుడు మనకు వద్దు అని డైవర్ట్ చేశాడు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!