Advertisement
సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నారు చిరంజీవి. దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి తర్వాత పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయారు. ఆ బాధ్యతల్ని చిరంజీవి వేసుకున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ హయాంలో టికెట్ల వివాదం పై లీడ్ రోల్ తీసుకుని సీఎం జగన్ ని కలిశారు. చిత్ర పరిశ్రమ కోసం చేతులు జోడించి జగన్ ని అడగడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు కొండా సురేఖ చేసిన కామెంట్లు ప్రకంపలను సృష్టిస్తున్నాయి. సమంత, నాగచైతన్య విడకులకి కేటీఆర్ కారణమని చెప్తూ కేటీఆర్ ని టార్గెట్ చేసే క్రమంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లాలని నాగార్జున, నాగచైతన్య ఒత్తిడి తీసుకొచ్చారని సమంత ఒప్పుకోకపోవడంతో విడాకులు ఇచ్చారని సురేఖ కామెంట్స్ చేశారు.
Advertisement
Advertisement
ఈ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబంతో పాటుగా సినీ పరిశ్రమ స్పందించి ఖండించారు. జూనియర్ ఎన్టీఆర్, నాని, ఆర్కే రోజా తదితరులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిరంజీవి కూడా స్పందించారు. గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి తను చాలా బాధపడ్డాను అని.. వార్తల్లో నిలవడానికి సెలబ్రిటీల పేర్లు వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.
Also read:
చిత్ర పరిశ్రమకు చెందిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. గతంలో సినీ పరిశ్రమ తరపున పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చాక.. సినీ పరిశ్రమకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అయితే పవన్ ఇంతవరకు ఈ విషయంపై స్పందించట్లేదు. దానికి కారణం ఏంటా అని ఆరా తీస్తున్నారు అంతా.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!