Advertisement
శ్రావణమాసo…. అంటే తెలియని వారు ఉండరు. ఈ శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. దాదాపు నెల రోజుల పాటు… శ్రావణమాసం కొనసాగుతోంది. ఈ శ్రావణ మాసంలో మహిళలు అనేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఇంట్లో మాంసాహారం అస్సలు ముట్టరు. అసలు ఈ శ్రావణ మాసంలో ఎందుకు మాంసాహారాన్ని ముట్టరో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
1. సాధారణంగా హిందూ ధర్మం ప్రకారం మాంసాహారం నిషిద్ధం. కానీ చాలామంది మాంసాహారం తీసుకుంటారు. అందుకే ధర్మం ప్రకారం ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మాంసాహారం జోలికి వెళ్లరు. హిందూ మత గ్రంథాలైన భగవద్గీత, వేద పురాణం, మహాభారతంలో మాంసాహారం తీసుకోవడం తప్పు అని చెప్పారు.
Advertisement
2. శ్రావణమాసం అనేది వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దానివల్ల మనుషుల జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మాంసాహారం తినకపోవడం మంచిది. అందుకే శ్రావణ మాసంలో ఉపవాసం చేసే సమయంలో చాలామంది తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటారు.
3. చేపలు, అలాగే ఇతర జలచరాలు వర్షాకాలంలో సంతానోత్పత్తి చేస్తాయి. అప్పట్లో చేపలని పెట్టడానికి వేరేగా ఫార్మ్స్ లాంటివి ఉండేవి కాదు. దాంతో ఆ జలచరాల జాతిని అంతం చేసినట్టు అవ్వకూడదు. అనే ఉద్దేశంతో అప్పట్లో శ్రావణమాసంలో సీ ఫుడ్స్ తీసుకునే వాళ్ళు కాదు. హిందూ ధర్మం ప్రకారం జీవిని చంపడం అనేది తప్పుగా భావిస్తారు అందుకే మాంసాహారం ముట్టుకోరు.
Also Read: అసలు అగ్నిపథ్ స్కీం ఏంటి ? దేశవ్యాప్తంగా ఎందుకు దాన్ని యువత వ్యతిరేకిస్తుంది ?