Advertisement
ఏదైనా అనకూడని మాటలు అంటే అలా మాట్లాడొద్దు పైన తధాస్తు దేవతలు ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సంధ్య వేళలో పొరపాటున చెడును సంకించే మాటలు మాట్లాడేటప్పుడు తదాస్తుదేవతలు ఉంటారు జాగ్రత్త అని పెద్ద వాళ్ళు హెచ్చరిస్తారు. అసలు ఈ తదాస్తు దేవతలు ఎవరు..? వాళ్ల గురించి తెలుసుకుందాం.. తదా అంటే అదే విధంగా లేదా ఆ ప్రకరం. ఆస్తు అంటే కావాల్సింది.
Advertisement
మీరు అనుకున్నది ఆ ప్రకారమే జరుగుతుంది అని దీనికి అర్థం. సాయంత్రం వేళలో తధాస్తు దేవతలు ఉంటారని మన నమ్మకం. అందుకనే మన మనసు ఎప్పుడూ కూడా మంచి జరగాలని ఆశిస్తే మనకు మంచి జరుగుతుంది. కీడు జరుగుతుందేమో అని భయపడడం లేదా ఎక్కువసార్లు చెడు ఆలోచనలు మన మనసులో మెదులుతూ ఉంటే చెడు జరుగుతుంది. తధాస్తు దేవతలు తధాస్తు అనడం వలన ఇలా జరుగుతుంది. అందుకు ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు మాత్రమే చేయాలి.
Advertisement
Also read:
ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ధనము కలిగి ఉండి సంతోషంగా వాళ్ళ జీవితం గడుపుతూ బయటకు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి.. మా దగ్గర డబ్బు లేదు అని పదేపదే అంటూ ఉంటారో.. అలా అనడం వలన దేవతల ఆశీర్వాదం అలాగే కలిగే ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడూ కూడా కీడును సంకించే మాటలు మాట్లాడకూడదు అని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. మనం ఏదైనా కోరుకున్నప్పుడు లేదా కావాలనుకున్నప్పుడు ఇతరులు మనల్ని ఉద్దేశించి సంబోధిస్తారు. అంటే దానికి అర్థం అనుకున్నది జరగాలని. అంతేకాకుండా ఏదైనా శుభకార్యాలు తలపెట్టినప్పుడు తధాస్తు అని చెప్పడానికి గల కారణం మీరు అనుకున్న విధంగా జరుగుతుంది అని చెప్పడం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!