Advertisement
చాలా మంది టీనేజ్ లో ఉన్నప్పుడు మొటిమల వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. కాలేజీకి వెళ్లే అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే సిగ్గుతో చచ్చి పోతారు. ఈ మొటిమలు అనేవి చర్మం లోపల ఉండే హార్మోన్ల పై ఆధారపడి ఉంటాయి. కొన్ని రకాల హార్మోన్లు చర్మం లోపల వెంట్రుకలు పక్కన ఒక గ్రీస్ ను ఉత్పత్తి చేస్తాయి. అదే పింపుల్స్ గా మారుతాయి. మీ కుటుంబంలో మీ తండ్రి లేదా తల్లి కి యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఉంటే మీకు కూడా 90% పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
Advertisement
ఈ మొటిమలు ఎక్కువగా టీనేజ్ లో వస్తూ ఉంటాయి. కొంతమందికి టీనేజ్ దాటి 30 సంవత్సరాల వరకు కూడా వస్తూ ఉంటాయి. 14 నుండి 17 సంవత్సరాల అమ్మాయిల హార్మోన్ల డెవలప్ అవడం వల్ల వారిలో పింపుల్స్ ఏర్పడతాయి. ఇలా వయసు పెరిగేకొద్దీ హార్మోన్లు కూడా చేంజెస్ అవుతూ అవి తగ్గిపోతుంటాయి. ఒకవేళ మొటిమలు వచ్చినా ఉన్నా కానీ బాధ పడవలసిన అవసరం లేదు. అవి తొందరగా తగ్గాలని ఏవి పడితే అవి ముఖానికి పూసుకుని ఉన్న చర్మాన్ని పాడుచేసుకోవద్దని వైద్య నిపుణులు అంటున్నారు. మరి మొటిమలను తగ్గించే కొన్ని టిప్స్ మీరు చూడండి.
Advertisement
ముఖ్యంగా రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువగా మోహాన్ని కడగకూడదు. కొంతమంది పదే పదే ఫేస్ కడగడం వల్ల స్కిన్ డ్రైగా మారి మొటిమలు వస్తాయి. పింపుల్స్ ఎక్కువగా ఉన్నవారు బాగా వేడి నీళ్లు, ఎక్కువగా చల్లని నీళ్లు అసలు మొహానికి రాసుకోరాదు. గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే ఫేస్ శుభ్రం చేసుకోవాలి. సబ్బుతో ఎక్కువ సమయం వరకు ఫేస్ రుద్దకూడదు. పింపుల్స్ పగిలేలా అస్సలు కలగకూడదు. ప్రతిరోజు సాయంత్రం ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తో తుడుచుకొని దానికి నాచురల్ క్రీమ్ ఏదైనా ఉంటే అప్లై చేయండి. దీని ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
ALSO READ:
గోత్రం అంటే ఏమిటి..? ఒకే గోత్రం ఉన్న వారు వివాహం చేసుకోవచ్చా..?