Advertisement
పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే క్రమశిక్షణ. పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ట్రైనింగ్ లో అభ్యర్థులు చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో జంపింగ్, వామ్ అప్ తో పాటు వారి జుట్టును చాలా చిన్నగా కత్తిరిస్తారు. అయితే జుట్టుని చిన్నగా ఎందుకు చిన్నగా కత్తిరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూ ఒకటే యూనిఫాం ధరించాలి. దీనివలన కుల, మత, ధనిక, పేద వర్గాల భేదం లేకుండా అందరూ ఒక్కటే అనే భావంలో ట్రైనింగ్ పొందుతారు. ఐపీఎస్ కు ఎంపిక ఈ ట్రైనింగ్ తీసుకునే వారు విధిగా రూల్స్ పాటించాలి.
Advertisement
ముఖ్యంగా…పోలీస్ ట్రైనింగ్ కు వెళ్ళిన ప్రతి ఒక్కరూ హెయిర్ కట్ కచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఎక్కువ భాగం శారీరక శ్రమకు కేటాయిస్తారు. ఫ్యాషన్ కోసం జుట్టు కత్తిరించు కోవడానికి ఎక్కువ సమయం అవుతుంది. అదే షార్ట్ హెయిర్ కట్ అయితే చాలా తొందరగా పూర్తి అవుతుంది. ఐపీఎస్ అంటే ఎంతో కఠినమైన శ్రమ. ఇందుకోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులకు ముందే అర్థం అయ్యేలా చెప్పడం కోసమే ట్రైనింగ్ కు ముందే జట్టును కత్తిరిం చేస్తారు.
Also Read: అంబులెన్స్ కు “108” నంబర్ ఎందుకు వచ్చింది.. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి..?