Advertisement
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కూడా ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్థిరపడడం సులువు కాదు. ఓ నటుడుగా సక్సెస్ అవ్వాలంటే కచ్చితంగా ట్యాలెంట్ ఉండాలి. అదృష్టం ఉండాలి. అలాంటిది నటుడుగా సక్సెస్ అవ్వడమే కాకుండా రచయితగా స్క్రీన్ ప్లే రైటర్ గా దర్శకుడిగా కమెడియన్ గా ఇలా చాలా వాటిల్లో పేరు తెచ్చుకున్నారు. పోసాని కృష్ణమురళి ఒకానొక దశలో ఆయన లేని సినిమాలు అంటూ లేదు. ఆ తరహా క్రేజ్ ని ఆయన సంపాదించుకున్నారు.
Advertisement
ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి శత్రువులు ఎక్కువైపోయారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తర్వాత కొన్ని అనుకోని కారణాల వలన పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేసారు. చిరంజీవితో ఆయనకు విభేదాలు వచ్చి వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక పోసాని కృష్ణమురళి కాస్త నోరు ఎక్కువ జారడం మొదలుపెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ ని నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ ని అయితే వినకూడని పదాలతో తిట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్లను కూడా నాశనం అయిపోవాలని శాపనార్ధాలు పెడుతున్నారు.
Advertisement
Also read:
Also read:
పవన్ కళ్యాణ్ అభిమానులు దాడికి కూడా పాల్పడ్డారు. దీంతో పోసాని కృష్ణ మురళి పోలీస్ సెక్యూరిటీతోనే బయటికి వస్తున్నారు. ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిందో అప్పటి నుంచి ఆయన అడ్రస్ లేకుండా పోయింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభిమానులు తనని ఏమైనా చేస్తారేమో అన్న భయంతో వాడుతున్న మొబైల్ నెంబర్స్ అన్నిటిని కూడా మార్చేసారట. ఐదేళ్లు కూడా ఆయన సినిమాలు కానీ రాజకీయాల్లో కానీ యాక్టివ్ గా ఉండే సమస్య లేదని తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!