Advertisement
టాలీవుడ్ నటుడు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్కు మంగళవారం జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసుకి సంబంధించి నేరం రుజువైనందుకు గాను ఆయనకు జైలు శిక్ష పడింది. యువీఎస్ఎస్ ప్రబోధ్ ఒక వ్యాపారవేత్తకు చెల్లింపు నిమిత్తం రూ.43 లక్షల చెక్కును జారీ చేసారు. అయితే.. ఆ చెక్ బౌన్స్ అవడంతో సదరు వ్యాపారువేత్త కోర్టులో కేసు వేశారు. దీనితో ఈ కేసులో ప్రభాస్ సోదరుడు ప్రభోద్ ను అరెస్ట్ చెయ్యాల్సి వచ్చింది.
Advertisement
వీటిని కూడా చదవండి: అలా చేయడానికి భయపడి.. రెండో పెళ్లితో నరకం అనుభవించిన ఘంటసాల.. అసలేమైందంటే?
ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ మీడియా అటెన్షన్ కి దూరంగా ఉంటారు. చాలా మందికి ఇప్పటివరకు ప్రభాస్ కి ఓ సోదరుడు ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు. ఇంతకీ ఈయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణం రాజు గారి తమ్ముడు సూర్య నారాయణ రాజు గారి రెండవ సంతానంగా, మొదటి కుమారుడిగా ప్రబోధ్ గారు జన్మించారు. సూర్య నారాయణ రాజు గారికి మొదటి సంతానంగా ఓ ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇద్దరు అబ్బాయిలు ప్రబోధ్, ప్రభాస్ లు జన్మించారు.
Advertisement
వీటిని కూడా చదవండి: ఇప్పుడు టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా మారిన కుమారి ఆంటీ.. ఎలా అంటే?
వీరిద్దరూ కృష్ణం రాజు తో చనువుగానే ఉండేవారు. కృష్ణం రాజు గారు చనిపోయినప్పుడు కూడా వీరి బాధ వర్ణనాతీతం. ఆయన అంత్యక్రియలను కూడా పెద్ద కొడుకుగా ప్రబోధ్ గారే చేసారు. అయితే.. ఈయన లైం లైట్ లోకి వచ్చింది మాత్రం చెక్ బౌన్స్ కేసు తోనే. అప్పటి వరకు ప్రభాస్ కు ఓ బ్రదర్ ఉన్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. ప్రబోధ్ గారు కూడా మీడియా అటెన్షన్ కి దూరంగానే ఉంటారు.
Read More: పెళ్లి చేసుకోనున్న బర్రెలక్క, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్? వైరల్ అవుతున్న న్యూస్..?