Advertisement
చాలామంది షాపింగ్ చేయడానికి డీమార్ట్ కి వెళ్తూ ఉంటారు. డీమార్ట్ లో వస్తువులు చౌకగా వస్తూ ఉంటాయని చెప్పడం మీరు చాలా సార్లు వినే ఉంటారు. లేదంటే షాపింగ్ చేసిన తర్వాత మీరు ఫీల్ అయి ఉంటారు. సరసమైన ధరల్లో కావలసిన వస్తువులు లభించే డీమార్ట్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చాలామంది షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మెట్రో నగరాల నుండి నగరాల వరకు ప్రతి చోట డీమార్ట్ ఉంది. డిమార్ట్ ఖ్యాతి ఎంత పెరిగింది అంటే ప్రతి మధ్యతరగతి ప్రజలు దీనిని సందర్శిస్తూ ఉంటారు. కిచెన్ ఐటమ్స్ దుస్తులతో పాటుగా అనేక రకాల ప్రొడక్ట్స్ మనకి లభిస్తూ ఉంటాయి.
Advertisement
ఎక్కువ మంది డిమార్ట్ డిమార్ట్ లో షాపింగ్ చేయడానికి కారణం వస్తువులు చౌకగా లభిస్తాయని. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చెప్పుకోదగ్గ జనాభా లేని ప్రాంతంలో ఇంకా సొసైటీలు ఏర్పడిన ప్రాంతాల్లో డిమార్ట్ నిర్మించగానే భూములు రేట్లు కూడా పెరిగిపోయాయి. డీమార్ట్ ఎక్కడ ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. డిమార్ట్ లో ఇంత చౌకగా వస్తువుల లభించడం వెనక ఓ మాస్టర్ మైండ్ ఆలోచన ఉంది. నిజానికి వ్యక్తి 12వ తరగతి కూడా పూర్తి చేయలేదు. కానీ నేడు తన వ్యాపార ప్రతిభతో దేశంలోని సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా మారిపోయారు డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధా కిషన్ దమాని ఆస్తులు లక్ష కోట్లకు పైగా ఉన్నాయి. కానీ రాధా కిషన్ కేవలం 12వ తరగతి మాత్రమే చదువుకున్నారు. స్టాక్ మార్కెట్లో ముందంజలో ఉన్న ధమాని సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు మొదట్లో అనేక వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు.
Advertisement
Also read:
మ్యాచ్ టై అయినా సూపర్ ఓవర్ ఎందుకు నిర్వహించలేదు..?
2002లో ముంబైలో డీమార్ట్ ని మొదట ప్రారంభించారు. అద్దె స్థలంలో ఏర్పాటు చేయకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం డీమార్ట్ కు దేశంలో మూడు వందలకు పైగా స్టోర్లు ఉన్నాయి. అద్దె స్థలంలో దుకాణం తెరవకపోవడమే వస్తువులు చౌకగా దొరకడానికి కారణం. దీని వలన అతని వ్యాపారానికి నిర్వహణమైన ఖర్చులు చాలా తగ్గించింది. వీరికి సొంత భూములు ఉండటం వలన ఇబ్బంది లేదు. ఇలా ఖర్చుల్లో ఐదు నుండి ఏడు శాతం ఆదా చేసుకుంటున్నారు. మిగిలిన మొత్తాన్ని డిస్కౌంట్ రూపంలో అందిస్తుంది. డిమార్ట్ త్వరగా తన స్టాక్ ని పూర్తి చేయడం ఇంకొక కారణం. 30 రోజుల్లో సరుకులు పూర్తి చేసేసి కొత్త ఆర్డర్ చేయాలనేది వారి లక్ష్యం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!