Advertisement
దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. పూరి జగన్నాథ్ అందరికీ సుపరిచితమే. ఆయన ప్రస్తుతం రామ్ హీరోగా వస్తున్న డబల్ ఇస్మార్ట్ తో బిజీగా ఉన్నారు. పూరి జగన్నాథ్ కొద్దిరోజుల క్రితం మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో జరిగిన ఎన్నో ఒడిదుడుకులకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో లావణ్యతో లవ్ ఎలా మొదలైంది, పెళ్లి ఎలా చేసుకున్నారు అనే వాటి గురించి కూడా షేర్ చేసుకున్నారు.
Advertisement
పూరీ జగన్నాథ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లావణ్యను ముందుగా షూటింగ్లో చూసాను అప్పుడు నేను యాడ్ షూట్ చేస్తున్నా.. అప్పుడు అది చూడ్డానికి ఆమె వచ్చింది అలా తనను ఒక గంట పాటు చూసాను. తను మాత్రం నన్ను కాకుండా షూటింగ్ చూస్తుందని చూసిందని పూరి జగన్నాథ్ చెప్పారు. తర్వాత నా అసిస్టెంట్ తో నా విసిటింగ్ కార్డును పంపించాలని తర్వాత లావణ్య నాతో మాట్లాడడానికి వచ్చిందని అప్పుడు ఆమెను నేరుగా పెళ్లి చేసుకుందామా అని అడిగానని పూరి చెప్పారు. దీంతో ఆమె కూడా ఒప్పుకుంది అని ఆయన అన్నారు అప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆమెను కలవడానికి భయపడేవాడినని పూరి చెప్పారు. ఓసారి ఇద్దరూ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఆమె ఫుల్ తందూరి చికెన్ ఆర్డర్ చేసింది.
Advertisement
Also read:
నేను మాత్రం తినకుండా ఆలోచిస్తుంటే ఆమె మాత్రం మొత్తం తినేసింది అది చూసి షాక్ అయ్యాను. వెంటనే ఆమెని వదిలేద్దాం అనుకున్నాను. కానీ తనకు అలా చెప్పలేకపోయాను అని పూరి జగన్నాథ్ అన్నారు. లావణ్య పూరి పెళ్లి ఫ్రెండ్స్ చేసేసారు. వాస్తవానికి అందుకు ముందే నేను నా రెండు ఫ్యామిలీలకు పెళ్లి గురించి చెప్పి ఒప్పించాను కానీ ఖర్చు పెట్టకూడదని ఉద్దేశంతో దొంగతనంగా పెళ్లి చేసుకున్నాం అని ఆయన అన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!