Advertisement
దర్శకధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన హిస్టరీలో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఇటీవల ఆయన తీసిన బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు ఆయన పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అయిన దర్శకుడిగా నిలబెట్టాయి. ఆయన దర్శకత్వం లో ఇప్పటికే పలు హీరోలు సూపర్ సక్సెస్ అందుకున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో హీరోలుగా సక్సెస్ అయ్యారు. అయితే.. దర్శకేంద్రుడు రాజమౌళి తనయుడు మాత్రం హీరోగా సక్సెస్ కాలేదు
Advertisement
రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. కార్తికేయ కూడా హీరో కట్ అవుట్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటారు. తన లుక్స్ తో ఆయన ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ కార్తికేయ ఎందుకు హీరో అవ్వలేదు? అన్న సందేహం చాలా మంది తెలుగు ఆడియన్స్ లో ఉంది. ఈ ప్రశ్నకి రాజమౌళిని ఒక ఇంటర్వ్యూ లో సమాధానం చెప్పారు.
Advertisement
రాజమౌళి కూడా కార్తికేయను సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలనీ భావించారట. కానీ, కార్తికేయకు హీరోగా నటించడం ఏమాత్రం ఇష్టం లేదట. సినిమాల్లో హీరోగా నటించడం కంటే.. సినిమాలను బిజినెస్ చేయడమే ఇష్టం అని కార్తికేయ ఇప్పటికే పలు సందర్భాలలో స్పష్టం చేశారట.ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన అన్ని సినిమా బిజినెస్ వ్యవహారాలను కార్తికేయ దగ్గరుండి చూసుకుంటారు. రీసెంట్ గా వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కు ఆస్కార్ రావడం వెనుక కూడా కార్తికేయ కృషి ఉందన్న సంగతి తెలిసిందే. కార్తికేయ బిజినెస్ వైపు వెళ్ళడానికే ఆసక్తి చూపించడంతో తానూ కూడా ఆ దిశగానే కార్తికేయని ప్రోత్సహిస్తున్నానని రాజమౌళి చెప్పుకొచ్చారు.
మరిన్ని..