Advertisement
సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ సినిమా స్క్రీన్ కు బయట చాలా సాధారణంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయన ఎలాంటి మేకప్, హెయిర్ స్టైలింగ్ చేసుకోరు. ఓ సాధారణ వ్యక్తి ఎలా ఉంటారో అలానే బయట కూడా కనిపిస్తూ ఉంటారు. కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు.. ఆయన అంతర సౌందర్యం కూడా ముఖ్యమని చెబుతూ ఉంటారు. డౌన్ టు ఎర్త్ గా ఉండే వ్యక్తిత్వం ఆయన సొంతం. అయితే.. సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ.. బయట చాలా సాధారణ వ్యక్తిగా ఉండడానికి కారణం ఉంది.
Advertisement
ఎన్నిసార్లు రజినిని ఈ విషయం గురించి ప్రశ్నించినా ఆయన సింపుల్ గా సమాధానాలు చెబుతూ ఉంటారు. రియల్ లైఫ్ లో కూడా నటించడానికి నాకెవ్వరూ డబ్బులు ఇవ్వరు అంటూ సరదాగా జోక్స్ కూడా వేస్తుంటారు. కానీ, ఆయన తెర వెనుక ఎలాంటి మేకప్ వేసుకోకుండా సాధారణంగా ఉండడానికి ఓ సంఘటన కీలక కారణంగా ఉంది. రజినీకాంత్ ఓసారి ఎలాంటి మేకప్ లేకుండా బయటకు వెళ్లారట. ఆ సమయంలో ఓసారి ఆయన అనుకోకుండా కార్ దిగి నడుస్తూ వెళ్తున్నపుడు.. ఓ మహిళా ఆయనను తక్కువగా అంచనా వేసి చేతిలో పదిరూపాయలు పెట్టిందట.
Advertisement
రజినీకి విషయం అర్ధం అయినా.. ఏమీ మాట్లాడకుండా తన కార్ లో వెళ్లి కూర్చున్నారట. అది గమనించిన ఆమె.. రజినీని సరిగ్గా చూసి గుర్తు పట్టి.. తిరిగి ఆయన వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పిందట. కానీ, ఈ సంఘటన రజిని లైఫ్ స్టయిల్ ను మార్చేసింది. ఆయనకు ఓ విషయం అర్ధమైంది. స్టార్ డమ్, మేకప్ ఇవన్నీ లేకుంటే జీవితం ఇదా అనిపించిందట. ఇకనుంచి తన అభిమానులు తనని మేకప్ తోనో లేక తన స్టార్ డమ్ తోనో కాకుండా తన ఒరిజినాలిటీని చూసి ఇష్టపడాలని భావించారట. అప్పటినుంచి రజిని ఎలాంటి మేకప్ లేకుండా చాలా సింపుల్ గా ఉంటూ వస్తున్నారట.
మరిన్ని..
ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ ఆర్టిస్టులు అందరూ చనిపోయారని తెలుసా ? వారెవరంటే ?
పాక్ జట్టు నుండి పెద్ద హిట్స్ లేకపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన పాక్ ఓపెనర్..!
న్యాయమే గెలుస్తుంది.. త్వరలో బయటకి వస్తా.. అంటూ బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు.. ఇంకా ఏమన్నారంటే?