Advertisement
ప్రస్తుతం అయ్యప్ప స్వామి దీక్ష రోజులు నడుస్తున్నాయి. కార్తీక మాసం సందర్భంగా దీక్ష వేసుకున్న అయ్యప్ప స్వాములు దర్శనం కోసం కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి పోటెత్తుతున్నారు. ఎక్కువ సంఖ్యలో ఒకేసారి అయ్యప్ప భక్తులు వస్తుండడంతో.. దర్శనానికి చాలా సమయమే పడుతోంది. లక్షలాది మంది వస్తుండడంతో.. ట్రాఫిక్ జామ్ అవుతుండడమే కాకుండా.. కొందరు దర్శనం అవ్వకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఈ రద్దీని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
Advertisement
భక్తుల రద్దీ ఎక్కువ అవుతుండడంతో.. దర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోంది. దర్శనం లేట్ అవుతుండడంతో.. ఇతర కారణాల నుంచి వచ్చిన భక్తులు తమ రిటర్న్ టికెట్ సమయానికి గడువు సమీపించే సరికి.. దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే.. ఈ రద్దీకి కారణాలు ఏమిటంటే… శబరిమల ఆలయం వద్ద ఉన్న పోలీసులకు అనుభవం లేకపోవడం, రద్దీని అంచనా వేయడంలో ట్రావెల్ కోర్ దేవస్థానం విఫలం అవడం, ఆలయ ప్రాంగణంలో అధికారులు భక్తుల క్రౌడ్ ని కంట్రోల్ చేసే చర్యలను పరిశీలనా చేయకపోవడం, కొత్త పోలీస్ అధికారులు విధుల్లోకి రావడంగా తెలుస్తోంది.
Advertisement
వర్చువల్ క్యూలో భక్తులు ముందుగానే దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకున్నా.. దానికి తగ్గట్లే దేవస్థాన అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం, పద్దెనిమిది మెట్ల వద్ద పోలీసులు లేకుండడం, పదునెట్టాంబడి వద్ద భక్తులు నెమ్మదించడం, పోలీసులకు, దేవస్థానం అధికారులకు సమన్వయము కుదరకపోవడం, రద్దీ ఎక్కువ ఉన్నా.. కేరళ ఎక్కువగా ఆర్టీసీ బస్సులను కేటాయించకపోవడం కూడా కారణాలుగా తెలుస్తోంది. గతంలో సన్నిధానం వద్ద రెండువేలకు పైగా పోలీసులు విధులు నిర్వర్తించారు. కానీ, ఈ ఏడాది కేవలం ఆరు వందల మంది మాత్రమే ఉన్నారు. దీనిపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి ఈ అంశాన్ని రాజకీయం చేయద్దని.. పరిస్థితి అదుపులోకి వస్తోందని తెలిపారు. కేరళా ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు, ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికి శబరిమల అభివృద్ధి కోసం 220 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్నారు.