Advertisement
ప్రశాంత్ నీల్ రచన మరియు దర్శకత్వం వహించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా సినిమా సలార్ ఇప్పుడు పాజిటివ్ రివ్యూతో దూసుకెళ్ళిపోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు గట్టిగానే ఎదురు చూసారు. అయితే.. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత అంచనాలను అందుకుంటుందా లేదా? అని చాలా సందేహాలు ఉండేవి. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ప్రభాస్ కెరీర్ లో మరో సూపర్ హిట్ పడ్డట్లే అని ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ కు సరైన హిట్ పడకపోవడంతో.. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ప్రభాస్ అభిమానులు కోరుకున్నారు.
Advertisement
వారు కోరుకున్నట్లే ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే.. భారత దేశ వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లోనూ ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. కానీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమాకు మంచి టాక్ ఏమీ రాలేదట. అక్కడ ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదని తెలుస్తోంది. దానికి కారణం ఏంటంటే.. ఈ సినిమాలోని మాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్ ని ఈ ప్రాంతాల వారు ఇష్టపడలేదు అని తెలుస్తోంది.
Advertisement
ఇక కర్ణాటక ప్రాంతంలోని ప్రజలకు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఉగ్రం సినిమా ముందే పరిచయం ఉంది. సలార్ ఈ సినిమాకి రీమేక్ అని పేరు తెచ్చుకోవడంతో.. అక్కడి ప్రజలు ఈ సినిమాపై ఇంటరెస్ట్ చూపించలేదని తెలుస్తోంది. ఉగ్రం సినిమాకు, ఈ సినిమాకు చాలా తేడాలు.. మార్పులు చేర్పులు చేసినప్పటికీ.. కర్ణాటక ప్రజలు సలార్ ని చూడడానికి ఇష్టపడట్లేదని తెలుస్తోంది. అందుకే సలార్ సినిమాకు కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కలెక్షన్స్ తగ్గాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Read More:
ప్రేమించిన అమ్మాయిని అటల్ బిహారీ వాజపేయి ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? కారణం ఏమిటి..?
చిరంజీవి గారు అతనికోసమే బిగ్ బాస్ ప్రోగ్రాం చేసేవారట ! ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరంటే ?