Advertisement
బాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో నాగచైతన్య సమంత ఒకరు. ఏ మాయ చేసావే సినిమాతో వీళ్ళు దగ్గరయ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత పెద్దల సమక్షంలో 2017లో పెళ్లి చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వలన వీళ్ళు విడిపోతున్నట్లు 2021లో ప్రకటించారు. అప్పటి నుంచి వీళ్ళ ఫ్యాన్స్ బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. క్యూట్ కపుల్ విడిపోవడం నచ్చలేదని చాలామంది కామెంట్లు కూడా చేశారు. అయితే విడాకులు తర్వాత కూడా ఇద్దరూ మళ్ళీ కలుస్తారేమో అని చాలా మంది భావించారు.
Advertisement
తాజాగా చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో వీళ్ళు మళ్ళీ కలుస్తారన్న ఆశలు ఆవిరి అయిపోయాయి. విడాకులు తీసుకున్న మూడేళ్ల తర్వాత చైతన్య శోభిత పెళ్లికి సిద్ధమయ్యారు. సమంత, చైతు మళ్ళీ కలవడం కష్టమేనని మ్యాజిక్ జరిగితే తప్ప మళ్ళీ కలవరిని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం సమంత ఐటమ్ సాంగ్స్ చేయడం, బోల్డ్ సీన్స్ చేయడం అని చాలా రూమర్స్ కూడా వచ్చాయి.
Advertisement
Also read:
అప్పట్లో నాగచైతన్య శోభిత దూళిపాళ్ల డేటింగ్ లో ఉన్నారని ఇద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లారని రూమర్స్ వచ్చాయి. సమంతతో విడాకులు తర్వాత వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారా లేదంటే ముందే ఉన్నారా అని వార్తలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అయితే అసలు వీళ్ళు విడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలీదు. తల్లికి జరిగిన ఘటనను సమంతకు చైతు రిపీట్ చేశాడని కొందరు చైతు పై ఫైర్ అవుతున్నారు. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కి గురవుతున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!