Advertisement
ఆషాడ మాసం వచ్చిందంటే చాలు కొన్ని రూల్స్ ని తప్పకుండా పాటించమని పెద్దలు చెప్తూ ఉంటారు, ముఖ్యంగా ఆషాడమాసం వచ్చిందంటే చాలు ఆషాడ మాసం రాక ముందే ముహూర్తం చూసుకుని కొత్త కోడలని పుట్టింట్లో దింపేసి వచ్చేస్తూ ఉంటారు. అయితే ఎందుకు ఆషాడమాసంలో కొత్తగా పెళ్లయిన అమ్మాయి అత్తవారింట్లో ఎందుకు ఉండకూడదు..? పుట్టింటికి ఎందుకు వెళ్లిపోవాలి అనే కారణాన్ని ఇప్పుడు చూద్దాం. చాలామందిలో ఉండే సందేహమే ఇది.
Advertisement
ఆషాడ మాసంలో అత్త కోడలు కలిసి ఎందుకు ఉండకూడదు.. భార్య భర్తలు కలిసి ఎందుకు ఉండకూడదు అని.. మరి ఇక కారణాన్ని చూసేద్దాం.. ఈరోజుల్లో అంటే ప్రతి ఒకరు ఉద్యోగాలు వ్యాపారాలు అంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ ఇదివరకు చూసుకున్నట్లయితే ఉద్యోగాలు వ్యాపారాలు కాదు వ్యవసాయం మీదే అందరూ ఆధారపడి ఉండేవారు. పొలం పనులు చేసుకోవడం అప్పట్లో ఎంతో ముఖ్యం. సరైన సమయానికి పొలం పనులు చేసుకుని పంటలను బాగా పండించి డబ్బు చేసుకునేవారు.
Advertisement
ఆషాడ మాసం సమయంలో వర్షాలు బాగా పడతాయి ఇటువంటిప్పుడు కచ్చితంగా పొలం పనులు చేసుకోవాలి. పొలం పనులు చేసుకోకపోతే పంట రాదు పంట రాకపోతే డబ్బులు ఉండవు. జీవనాధారం వ్యవసాయమే కాబట్టి కచ్చితంగా ఆషాడ మాసంలో చేయవలసిన పంట పనులు చేయాలి. అయితే కొత్తగా పెళ్లయిన దంపతులకు పని మీద కంటే కూడా వారి భాగస్వామి మీద ఉంటుంది. కొత్తగా పెళ్లయింది కాబట్టి ఒకరితో ఒకరు సమయాన్ని గడపాలని అనుకుంటారు.
ఒకవేళ కనుక భాగస్వామికి ఎక్కువ ప్రాధాన్య ఇస్తే పంట పనులు ఆగిపోతాయి అలా జరగకూడదని పుట్టింటికి కొత్తగా పెళ్లయిన అమ్మాయిని పంపించాలని పెద్దలు పెట్టారు అప్పటినుండి కూడా ఈ సంప్రదాయాన్ని అందరం పాటిస్తున్నాము. అదే విధంగా ఆషాడమాసంలో గర్భిణీ అయితే ఎండాకాలంలో పిల్లలు పుడతారు. సమస్యలు కలగవచ్చు అని భార్యాభర్తలని వేరుగా ఉండమని చెప్పేవారు.
Also read:
కొత్త వాచీలలో టైమ్ ని 10:10 అనే ఎందుకు పెడతారు..? ఇంత పెద్ద కారణం ఉందని మీకు తెలుసా…?
భర్త బతకడని తెలిసి.. ఇద్దరి పిల్లలతో ఆమె అలా… అసలేం జరిగింది అంటే..?
మాల్స్ లో ఫుడ్ కోర్ట్ టాప్ ఫ్లోర్ లోనే ఎందుకు ఉంటుంది..? రీజన్ ఏమిటి..?