Advertisement
నటభూషణ శోభన్ బాబు.. ఈ పేరు చెబితే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. తెలుగు సినిమా సోగ్గాడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు శోభన్ బాబు. హీరోగా నటిస్తూనే రిటైర్మెంట్ ప్రకటించిన ఏకైక హీరోగా నిలిచిపోయారు. అద్భుతమైన యాక్టింగ్ ఈయన సొంతం. ఈయన అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు. ఈయనకు మహిళా ఫ్యాన్స్ కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు అందాల హీరోగా పేరుని తెచ్చుకొన్న హీరో శోభన్ బాబు. ఈయన అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు.
Advertisement
Read also: ఎన్టీఆర్ మరణానికి, తారకరత్న మరణానికి ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్స్ గమనించారా?
1937 జనవరి 14న కృష్ణాజిల్లా నందిగామలో జన్మించారు. కాలేజీ సమయంలో ఏర్పడ్డ సినిమాలపై ప్రేమ ఆయనని మద్రాస్ రైలు ఎక్కించింది. మల్లీశ్వరి సినిమాను 20 సార్లకు పైగా చూసి సినిమా యాక్టర్ కావాలని ఆశించారు. నటుడిగా ఆయన మొదటి సినిమా ఎన్టీఆర్ హీరోగా నటించిన దైవబలం. అలా కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలను అవకాశాలను అందిపుచ్చుకొని తెలుగులో అగ్ర హీరోగా ఎదిగారు. అయితే శోభన్ బాబు సినిమాలకు దూరం అయ్యాక చెన్నైలోనే సెటిల్ అయ్యారు. సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చాక ఎన్నో సినిమాలలో ఆఫర్లు వచ్చినా చేయలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆయన కెరీర్ లో సుస్వాగతం సినిమా ఎంతో మంచి పేరును తెచ్చి పెట్టింది.
Advertisement
Read also: రైళ్ల పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు ఉంటాయి ? అవి లేకుంటే కలిగే నష్టం ఇదేనా ?
అయితే ఈ చిత్రంలో రఘువరన్ పాత్ర కోసం మొదట శోభన్ బాబుని సంప్రదించారట. కానీ ఈ ఆఫర్ ని శోభన్ బాబు వదిలేశారు. అంతేకాదు అతడు సినిమాలో నాజర్ పాత్ర కోసం అడిగితే తిరస్కరించారట. అలా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే ఛాన్స్ లను వదిలేసుకున్నారు శోభన్ బాబు. ప్రేక్షకులు తనను హీరో గానే గుర్తుపెట్టుకోవాలని, తన సినీ కెరీర్ కూడా హీరోగానే ముగిసిపోవాలని భావించి శోభన్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే శోభన్ బాబు మళ్ళీ సినిమాలో నటించి ఉంటే ఆ రేంజ్ వేరేగా ఉండేది. ఆయనను చూసేందుకే సినిమాలకు వచ్చేవారని కచ్చితంగా చెప్పవచ్చు.
Read also: Telugu Movies News, Telugu News