Advertisement
కొత్త వాహనాలని కొనుగోలు చేసినప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళినప్పుడు కానీ పండగ రోజు కానీ వాహనాల కింద నిమ్మకాయల్ని పెట్టి నిమ్మకాయలను తొక్కించి వెళ్ళమని చెప్తూ ఉంటారు పెద్దలు. ఈ సాంప్రదాయం నిన్న మొన్న వచ్చినది కాదు. ఎప్పటి నుండో కూడా ఇదే సాంప్రదాయాన్ని చాలా మంది పాటిస్తున్నారు ముఖ్యంగా ఏదైనా ద్విచక్ర వాహనాన్ని కానీ నాలుగు చక్రాల వాహనాన్ని కానీ కొనుగోలు చేసినప్పుడు టైరు కింద నిమ్మకాయల్ని పెట్టి నిమ్మకాయల్ని తొక్కించి వెళ్ళమంటారు.
Advertisement
అలానే నిమ్మకాయలని మిరపకాయలని బండ్ల కి కడతారు. అయితే ఎందుకు ఈ సాంప్రదాయం ఉంది..? నిమ్మకాయలని ఎందుకు టైర్ కింద పెట్టి తొక్కించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… ఈ రోజుల్లో అంటే బండ్లు వచ్చాయి కానీ ఇది వరకు రోజుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే జంతువులని ఉపయోగించేవారు. గుర్రం బండి, ఎడ్ల బండి ఇటువంటివి అప్పట్లో ఉపయోగించేవారు. ఏదైనా దూర ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా వాటి మీదే వెళ్లేవారు.
Advertisement
పైగా అప్పుడు ఇలా మంచి రోడ్లు ఉండేవి కాదు. మట్టి రోడ్లు మాత్రమే ఉండేవి. అలాంటప్పుడు జంతువుల కాళ్ళకి రాళ్లు వంటివి గుచ్చుకునేవి ఇనుప వస్తువులు కూడా గుచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు జంతువుల కాళ్ల లోపల బ్యాక్టీరియా వెళ్లి సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంత ప్రమాదం జరుగుతుందని నిమ్మకాయలని తొక్కించేవారు. నిమ్మకాయలలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది బ్యాక్టీరియాతో పోరాడగలదు అందుకని అప్పుడు బండ్ల మీద వెళ్లేటప్పుడు నిమ్మకాయల్ని తొక్కించి వెళ్ళమనేరు.
అప్పుడు మొదలైన సంప్రదాయం ఇప్పుడు టైర్లు వచ్చినా కూడా కొనసాగుతోంది. సాంప్రదాయం ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైనా పరికరాల కింద నిమ్మకాయని ఉంచి పూజ తర్వాత వాటిని తొక్కించడం పూజకర్మలో ఒక భాగం. పైగా ఇది వరకు కత్తులు విల్లంబులు బాణాలు సూక్తులు వంటివి పోరాడడానికి వాడేవారు. వాటికి పూజ చేసేటప్పుడు నిమ్మకాయల్ని ఉపయోగించేవారు అప్పట్లో అవి ఆయుధాలు కానీ ఇప్పుడు కంప్యూటర్ వంటివి ఆయుధాలుగా మారాయి. వీటిని కూడా పూజిస్తున్నారు ఇప్పుడు.
Also read:
శనివారం నాడు వీటిని చూస్తే.. శనిదేవుడి అనుగ్రహం ఉంటుంది.. కష్టాలన్నీ పోతాయి కూడా..!
52 ఏళ్ళ క్రితం మసాలా దోస ధర ఎంతో మీకు తెలుసా..? పోస్ట్ వైరల్..!