Advertisement
అయోధ్య రామ మందిరం గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. అయోధ్య రామ మందిరం గురించి ఇప్పటికే మనం ఎన్నో విన్నాం. టీవీలో కూడా చాలా విషయాలు చూశాం అయోధ్య రామ మందిరంలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ట జరిగింది. అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టని ఘనంగా జరిపారు. 500 ఏళ్ల తర్వాత రాముడు అయోధ్యకి తిరిగి వచ్చారని దేశ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. రామ మందిర ప్రారంభోత్సవం నాడు దేశవ్యాప్తంగా పండగ వాతావరణం కనపడింది అయోధ్యలో రాములవారిని ప్రతిష్టించిన తర్వాత మొదటి రోజు వీఐపీలు బాల రాముడిని దర్శించుకున్నారు ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత రోజు ఏకంగా ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యకి చేరుకున్నారు.
Advertisement
బాల రాముడుని దర్శించుకున్నారు. వేలాది మందులు భక్తుల క్యూ లైన్ లో నిలబడి రాముల వారి కోసం అంత దూరం వెళ్లి మనసులో కోరికలను చెప్పుకున్నారు. ఇంతమంది ఒక్కసారిగా వెళ్లడం వలన వాళ్ళని నియంత్రించడం భద్రతా సిబ్బందికి కష్టమైంది కూడా అయితే ఎక్కడైనా మనం రామాలయంలో చూసినట్లయితే రాముడితో పాటుగా సీత లక్ష్మణుడు విగ్రహాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం కేవలం రాముడు విగ్రహాన్ని మాత్రమే పెట్టారు. దానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఈ రాంలల్ల విగ్రహామీ కర్ణాటక కి చెందిన అరుణ్యోగి రాజ్ అనే శిల్పి చెక్కారు. సీతారామ లక్ష్మణ హనుమంతుని విగ్రహాలతో ఉన్న అరుణ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారినప్పుడు అందరూ కూడా ఇలానే విగ్రహం ఉంటుందని అనుకున్నారు.
Advertisement
కానీ బాల రాముడు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు అయోధ్యలో బాలరాముడు విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అనే విషయానికి వచ్చేస్తే.. సముద్రగుప్తుడు విక్రమతిత్య కాలం 1076 నుండి 1126 సీఈ కి ముందు నుండే అయోధ్యలో రామాలయం ఉంది అప్పుడే రామ్ లల్లా అని ఐదు నుండి 6 అంగుళాల బాలరాముడి మూర్తి ఉండేది కాలక్రమమైన గుడి ఆక్రమానాలు జరిగాయి. తర్వాత కాలంలో అక్కడే అయోధ్యలో తవ్వకాలు జరిపారు అదే బాల రాముడు మూర్తి బయటకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే స్థలంలో రాముల వారి కోసం ఆలయాన్ని పున: నిర్మిస్తున్నాం కాబట్టి అప్పుడు ఎవరికి ప్రాణప్రతిష్ట చేయాలి కేవలం బాలరాములు వారికి మాత్రమే ఇలా చేయాలి. వయసు 5 నుండి 8 సంవత్సరాలు ఉండే మూర్తిని చెక్కారు. అందుకని కేవలం రాముడి విగ్రహాన్ని మాత్రమే ఇక్కడ ప్రతిష్టించారు ఇది అయోధ్యలో బాల రాముడిని పెట్టడం వెనుక కారణం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!