Advertisement
అందరం ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. మనం నిద్ర పోయేటప్పుడు కలలు వస్తూ ఉంటాయి కలలు కొన్ని మంచివి ఆనందాన్ని ఇచ్చేవి అయితే కొన్ని కలలు మాత్రం పీడకలలు అవుతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం నిద్ర లో మనకి వచ్చే కలలను బట్టి కొన్ని సంకేతాలు కూడా అవి తెలుపుతున్నాయని మనం తెలుసుకోవచ్చు. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొన్ని కలలు మనకి గుర్తుంటాయి కానీ కొన్ని కలలు మనం ఉదయం లేచేసరికి కనీసం గుర్తు కూడా ఉండవు. అయితే ఎందుకు కొన్ని కలలే గుర్తుంటాయి..? కొన్ని కలలు గుర్తు ఉండవు అని వెనక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడే చూద్దాం.
Advertisement
Advertisement
సాధారణంగా మనకి ఎన్నో కలలు వస్తూ ఉంటాయి కొన్ని కలలను మనం ఇట్టే మర్చిపోతూ ఉంటాం కానీ కొన్ని కలలు మాత్రం ఉదయం లేవగానే మనకి టక్కున గుర్తొస్తూ ఉంటాయి మనకి కలలు విచిత్రంగా అస్తవ్యస్తంగా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు వచ్చే కలలకు మన నిజ జీవితం తో అసలు సంబంధమే ఉండదు అందుకనే మెదడు పెద్దగా కలలకి ప్రాధాన్యతని ఇవ్వదు. మన మెదడు మనకి కావాల్సినవి అవసరమైన వాటిని గుర్తు ఉంచుకోవడానికి చూస్తుంది. మన కలల్ని లాంగ్ టర్మ్ మెమరీ కింద మార్చడం కష్టంగా ఉంటుంది. అయితే ఇదంతా ఓకే కానీ మరి ఎందుకు కొన్ని కలలు గుర్తుంటాయి..? దాని వెనక కారణం ఏంటి అనే విషయానికి వచ్చేస్తే.. కొన్ని కొన్ని సార్లు మనకి వచ్చే కలలకి మనం ఎమోషనల్ గా దగ్గరవుతూ ఉంటాం.
ఇలా ఎమోషనల్ గా దగ్గర అవడం వలన ఎక్కువగా అవి గుర్తుంటాయి బాధ కానీ భయం కానీ ఇలా ఏదైనా ఎమోషన్ కి దగ్గరగా కలలు ఉన్నట్లయితే అవి మనకి గుర్తుంటాయి. మనం ఒక ఎమోషన్ ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు బ్రెయిన్ లో అమిక్డాల యాక్టివ్ అవుతుంది. ఎమోషన్స్ ని మెమరీ ని అది ప్రాసెస్ చేస్తుంది. అందుకనే కలలు గుర్తుంటాయి. ఇదండీ కొన్ని కలలు గుర్తుండడానికి కారణం. అందుకనే కొన్ని కలలు మనకి బాగా గుర్తుండిపోతాయి నిద్ర లేవగానే టక్కున మనకే గుర్తొస్తుంటాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!