Advertisement
దుస్తులను ఎంచుకునేటప్పుడు అమ్మాయిలు బాగా ఎక్కువ టైం షాపింగ్ చేస్తూ ఉంటారు. రంగు, పేటర్న్ మొత్తం అన్నిటిని కూడా చూసుకుని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. చాలా తక్కువ మంది అబ్బాయిలు మాత్రమే ఇలా షాప్ చేస్తూ ఉంటారు ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం ఎప్పుడూ ఒకే రంగు దుస్తులు వేసుకుంటారు. ఎక్కువగా బ్లాక్ లేదంటే ఎప్పుడు వాళ్ళకి నచ్చిన ఒకే కలర్ బట్టల్ని వేసుకుంటూ ఉంటారు. అయితే అసలు ఎందుకు ఇలా బట్టలు ఎంచుకుంటూ ఉంటారు దీని వెనక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
Advertisement
దుస్తుల రంగుల ఎంపిక వివిధ మానసిక కారణాలతో ప్రభావితమవుతుందట. రంగులు మన మానసిక స్థితి, ప్రవర్తన అలానే ఇతరులు మనల్ని ఎలా గ్రహిస్తారో కూడా ప్రభావితం చేస్తాయి. ఈ ఎంపికలు వెనుక ఉన్న మానసిక కారణాల గురించి చూద్దాం. ఎవరైనా తమ భావోద్వేగాలను ప్రతిపాదించే రంగులను ఎంచుకుంటూ ఉంటారు. ఉదాహరణకు సంతోషంగా ఉన్న వాళ్ళు పసుపు లేదా నారింజ వంటి ప్రకాశవంతమైన రంగుల్ని వేసుకుంటారు. బాధలో ఉన్నవాళ్లు నలుపు లేదా బూడిద రంగు లేదంటే ముదురు రంగు బట్టల్ని ఎంచుకుంటూ ఉంటారు. ఇవి వారి అంతర్గత భావాలను వ్యక్తీకరించడంలో సహాయం చేస్తాయి.
Advertisement
Also read:
రంగులు వ్యక్తిత్వ లక్షణాలతో ముడిపడి ఉంటాయి. ఎక్స్ట్రావర్ట్స్ ఎరుపు లేదా ఊదా రంగు వాటిని ఎక్కువ ఇష్టపడవచ్చు. అంతర్ముకులు నీలం లేదా ఆకుపచ్చ వంటి మృదువైన రంగుల్ని ఎంచుకోవచ్చు. ఈ ప్రాధాన్యతలు వ్యక్తి పాత్ర గురించి చాలా బహిర్గతం చేయగలవు. ప్రతిరోజు ఒకే రంగుల్ని వేసుకోవడం వలన సౌకర్యాన్ని వారికి ఇస్తుంది. రోజువారి దుస్తులు నిర్ణయాలు తీసుకునే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ రొటీన్ తేలికగా రూపాన్ని నియంత్రించడంలో సహాయం చేయొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!