Advertisement
ప్రపంచంలో లెజెండరీ ఓపెనర్ల గురించి మాట్లాడినప్పుడల్లా, భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 టెస్టు పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్ గా గవాస్కర్ గుర్తింపు సంపాదించుకున్నారు. గ్రేట్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ సర్ డాన్ బ్రాడ్‌మన్ 29 సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన మొదటి బ్యాట్స్‌మెన్ కూడా సునీల్ గవాస్కర్ నే. మొత్తం ఆయన కెరీర్‌లో 34 సెంచరీలు, రెండు టెస్టు సిరీస్‌లలో 700కి పైగా పరుగులు చేసిన ఏకైక భారతీయుడు క్రికెటర్ గవాస్కర్. ఇలా ఎన్నో రికార్డులు ఆయన పేరిట ఇప్పటికీ ఉన్నాయి.
Advertisement
అయితే ఇంత గొప్ప క్రికెటర్ మైదానంలో మాత్రం హెల్మెట్ ధరించేవారు కాదు. ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో గవాస్కర్ ని మైదానంలో ఆడేటప్పుడు ఎందుకు హెల్మెట్ ధరించేవారు కాదు అంటూ ప్రశ్న ఎదురయ్యింది. గౌరవ్ కపూర్ ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ షోలో గవాస్కర్ హెల్మెట్ ధరించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. గవాస్కర్ మరియు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఒకే సంవత్సరంలో తమ టెస్టు అరంగేట్రం చేశారు. ఇద్దరి మధ్య చాలా గాఢమైన స్నేహం ఉండేది. అందుకే గవాస్కర్‌కి హెల్మెట్ ధరించమని ఇమ్రాన్ చాలాసార్లు సలహా ఇచ్చాడు. అయితే, గవాస్కర్ తన స్నేహితుడి సలహాను ఎప్పుడూ పాటించలేదని ఆయన చెప్పారు.
Advertisement
చెప్పాలంటే హెల్మెట్ ధరించాలని నాకు ఎప్పుడూ అనిపించలేదని గవాస్కర్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు . అలాగే నాకు నిద్రపోయే ముందు చదివే అలవాటు ఉంది. ఒక్కోసారి చదువుతూనే నిద్రపోవడం వల్ల నా మెడ నరాలు బలహీనపడ్డాయి. అందువలనే నేను హెల్మెట్ ధరించే వాడిని కాదని గవాస్కర్ చెప్పుకొచ్చారు. ఇక నాకు స్కల్ క్యాప్ ఉండేది. అది వేరే విషయం. కానీ మూడేళ్లుగా అది కిట్ బ్యాగ్‌లోనే పడి ఉంది. నేను దానిని కూడా ఉపయోగించలేదు.
కానీ 1983లో వెస్టిండీస్ పర్యటనలో మాల్కం మార్షల్ వేసిన షార్ట్ బాల్ నేరుగా వెళ్లి గవాస్కర్ నుదుటిపై కొట్టింది. దీంతో భారత డ్రెస్సింగ్ రూమ్‌లో నిశ్శబ్దం నెలకొంది. ఆ బాల్ గవాస్కర్‌ని తీవ్రంగా గాయపరచకపోవడం అభినందనీయం. ఈ సంఘటనతో కలవరపడకుండా, గవాస్కర్ మళ్లీ లేచి మార్షల్ యొక్క హై స్పీడ్ బంతులకు వ్యతిరేకంగా పోరాడాడు. ఈ సంఘటన తర్వాత, అతను కొన్ని సంవత్సరాల పాటు స్కల్ క్యాప్ ధరించారు.
Also Read :
మరణించిన వారి అస్థికలను “గంగా నది” లో కలపడానికి గల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా…?
ISRO Work Life: ఇస్రో వర్క్ లైఫ్ గురించి ఎవ్వరికి తెలియని టాప్ 10 విషయాలు!