Advertisement
ఎప్పుడైనా మనం టీవీలో చూసినా, పేపర్లలో చూసిన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ముఖానికి నలుపు రంగు ముసుగు వేస్తారు. లేదంటే ఒక మంకీ క్యాప్ ని తొడుగుతారు. అయితే అసలు ఎందుకు వాళ్ళని మనకి చూపించరు..? వాళ్ళని ఎందుకు కవర్ చేసి పెడతారు..? దాని వెనుక కారణం ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. అరెస్ట్ చేసిన తర్వాత వ్యక్తికి ముసుగు వేస్తారు. ముసుకు తీస్తే నేరస్తుడి రూపం అందరికీ తెలిసిపోతుంది. ఎప్పుడైనా జైలు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటారు కదా.. ఎప్పుడైనా జైలు నుండి విడుదలై మళ్లీ నేరం చేస్తే గుర్తుపట్టడానికి బాగుంటుంది కదా. మరి ముసుగు తీసే ఉంచచ్చు కదా ఎందుకు మూసేస్తారు అని చాలామంది అభిప్రాయపడతారు.
Advertisement
Advertisement
కానీ నిజానికి నేరం జరిగిన కేసులో అనుమానిస్తూ పోలీసులు అరెస్ట్ చేస్తారు. నేరం చేశారని నిర్ధారణ కోర్టులో న్యాయమూర్తి తీర్పు తర్వాతనే తేలుతుంది. ఒకవేళ అరెస్టు అయిన వ్యక్తి నిర్దోషి అయితే అందరూ తప్పు పడతారు. అందరికీ తెలిసిపోతుంది. ఆత్మ అభిమానం గౌరవం దెబ్బతింటుంది. అందుకే ముసుగు తొడుగుతారు. ప్రాథమికంగా నేరం రుజువయ్య దాకా కూడా ముసుగు తొడుగుతారు. నేరం రుజువు అవ్వనంత సేపు కూడా అరెస్టు అయిన అతను అనుమానితుడు అవుతాడు తప్ప నేరస్తుడు కాదు. అరెస్ట్ చేయబడిన వ్యక్తి ముఖాన్ని దాచుకుండా చూపిస్తే సాక్ష్యం చెప్పాలనుకున్న అతను ఆ ముఖాన్ని పదేపదే చూడ్డం వల్ల అతనే నేరస్తుడు అని తనకి తానుగా ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో అమాయకుడు బతుకు నాశనం అయిపోతుంది అందుకని ముసుగు వేస్తారు.
Also read: