Advertisement
తమిళలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటైన వారసులుగా విశ్వసించబడిన తమిళులు ప్రత్యేకమైన సాంస్కృతి మరియు సాంప్రదాయాల పరంగా చూపించడానికి చాలా ఉన్నాయి. సంవత్సరాల తరబడి దాని ప్రత్యేకమైన కళాత్మక పరిణామాలు సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులను తీసుకువచ్చే సంపదల స్టోర్ హౌస్ గా మారాయి. తమిళనాడు రాష్ట్ర సాంస్కృతిని దీర్ఘకాలంగా ప్రభావితం చేసిన అనేక అంశాలు ఉన్నాయి.
Advertisement
READ ALSO : విమానాల్లో ప్రయాణం చేసేప్పుడు ఏరోప్లేన్ మోడ్‌లో ఎందుకు ఉంచాలి ? లేకుంటే ఏమి జరగుతుంది ?
అయితే తమిళులను అరవవాళ్ళు, అరవం అని పిలుస్తుంటారు. ఇది చాలా మందికి తెలియని నిజం. వారిని ఎందుకు అలా పిలుస్తారు అంటే దానికి ఓ చరిత్ర ఉందని తెలుస్తోంది. గతంలో కొన్ని ప్రాంతాలను కలిపి మండలంగా పిలిచే వారట. తమిళనాడులోని అరవవాడు అనే ప్రాంతం ఉండేది. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో కూడా కొంత ప్రాంతాన్ని అరవనాడు కిందకే వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికీ కూడా కన్నడిగులను కొంగ అని పిలుస్తారట. దీనికి కూడా ఓ కారణం ఉంది.
Advertisement
వారు ఉంటున్న ప్రాంతం కొంగనాడు కావడంతో వారిని కొంగ అని పిలుస్తారనే వాదన ఉంది. దీంతో దేశంలో ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలవడం సాధారణమే. ఈ నేపథ్యంలో చారిత్రాత్మక దేశం కావడంతో ప్రాంతాలను బట్టి పేర్లు మారుతుంటాయి. దీనికి మనం ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. మన దేశంలో వివిధ రకాల జాతులు, మనుషులు, భాషలు ఉండటంతోనే భిన్నత్వంలో ఏకత్వం వచ్చింది. ఈ క్రమంలోనే మన ప్రాంతాల్లో చాలా తేడాలు ఉండటం గమనించాల్సిందే.
READ ALSO : ఈరోజు వాతావరణం 26.04.2023: తెలంగాణ, ఏపీలో మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు…!