Advertisement
నవంబర్ రెండవ తారీకు తెల్లవారు జామున సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుక డెస్టినేషన్ మ్యారేజ్ గా ఇటలీలో జరుగుతోంది. ఇప్పటికే పెళ్లి వేడుకల కోసం రెండు కుటుంబాల వారు ఇటలీకి చేరుకున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా మెగాస్టార్, మెగా పవర్ స్టార్, ఐకాన్ స్టార్ లు రకరకాలుగా ఫోటోలు తీసుకుని నెట్టింట్లో సందడి చేస్తున్నారు. అయితే.. ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కావాల్సి ఉంది.
Advertisement
నిజానికి ఈ వివాహం కోసం జూనియర్ ఎన్టీఆర్ కు ఎప్పుడో ఆహ్వానం అందింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఈవెంట్ కు వెళ్ళడానికి ముందుగానే ప్లాన్ కూడా చేసుకున్నారట. కానీ ఆఖరి నిమిషంలో ఆయన తన ప్లాన్ ను మార్చుకున్నారు. పెళ్ళికి వెళ్లడాన్ని మానుకున్నారట. దీనికి అసలు కారణం ఏంటంటే.. ఆయన ప్రస్తుతం “దేవర” సినిమాకు పని చేస్తున్న సంగతి తెలిసిందే. దేవర సినిమా కోసం తారక్ చాలా కష్టపడుతున్నారు. అయితే.. ఈ సినిమా దర్శకుడు శివ కొరటాల అనుకోకుండా షూటింగ్స్ రీ షెడ్యూల్ చేశారట.
Advertisement
ఈ సినిమా షెడ్యూల్స్ కారణంగా పెళ్ళికి వెళ్లాలనుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆగిపోవాల్సి వచ్చిందట. దీనితో తారక్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు శివ కొరటాలను గట్టిగానే తిట్టుకుంటున్నారట. మీరు షెడ్యూల్ చేయడం వల్లే మా తారక్ అన్న రామ్ చరణ్ అన్న కాంబోలో మంచి ఫొటోస్ ను మిస్ అవుతున్నాం అని తెగ ఫీల్ అయిపోయారట. ఒకవేళ తారక్ పెళ్ళికి వెళ్లి ఉంటె.. తారక్ అల్లు అర్జున్, తారక్-రామ్ చరణ్, తారక్- వరుణ్ తేజ్ ల కాంబోలో చాలా ఫొటోస్ వైరల్ అయ్యేవని.. అవన్నీ మిస్ అవుతున్నాం అని తారక్ ఫాన్స్ చాలా బాధపడిపోతున్నారు.
భలే మోసం చేసారుగా పూర్ణా మావా.. మజిలీ సినిమాలో ఇది గమనించారా?
స్వామి అయ్యప్ప మోకాళ్ళకు బంధనం ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
“పుష్ప” సినిమాలో ఈ డైలాగ్ ను వేణుమాధవ్ ముందే చెప్పారా? వైరల్ అవుతున్న వీడియో!