వివాహం.. ఓ మధురమైన ఘట్టం. నూరేళ్ళ జీవితం. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారు అంటే.. వారు తమ భాగస్వామితో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని అదే ఈ పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా అబ్బాయిలు… అమ్మాయిల లక్షణాలను చూసి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, మగాళ్లు తక్కువ వయసున్న స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆ విషయంపై ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తే, మగాడితో పోలిస్తే ఆడవాళ్ళలో లై*క కోరికలు, ప్రతిస్పందనలు రావడం 20వ ఏట నుంచే మొదలవుతాయి. మగాళ్ళకి అయితే 35 ఏళ్ల నుంచి మొదలవుతాయి. 40 నుంచి 50 ఏళ్ల వయసులో మగాళ్ల లై***క కోరికలు అధికంగా ఉంటాయి. 40-50 ఏళ్ల వయసులో మహిళలకు కోరికలు క్షీణిస్తాయి. ఓకే వయసు ఉన్న వారు పెళ్లి చేసుకుంటే మనస్పర్ధలు వస్తాయి. అందుకే తక్కువ వయసున్న స్త్రీ తో వివాహం జరిపిస్తారు. 60-70 ఏళ్ళు వచ్చాక మగాళ్ళలో కోరికలు తగ్గిపోతాయి. 20 నుంచి 40 లోపు వయసున్న ఆడవారిని 35 నుంచి 50 లోపు వయసున్న మగాళ్లు చేసుకుంటే ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా కుదురుతుందని స్టడీస్ చెబుతున్నాయి.
ఉదాహరణకు 20 ఏళ్ల అమ్మాయిని, 35 ఏళ్ల అబ్బాయి చేసుకుంటే బాగుంటుందనే విషయంపై కారణాలు చూస్తూనే అర్థమవుతుంది. ఈ కారణాల వల్ల ఒకప్పుడు 10,15 ఏళ్లు వయసు తక్కువ ఉన్న స్త్రీలను వివాహం చేసుకునేవారేమో అనిపిస్తుంది. ఒక రకంగా అలా చేసుకున్న కాపురాలు కూడా నిలబడ్డాయి. అయితే మారుతున్న కాలం ప్రకారం ఇప్పుడు అమ్మాయి వయసు మగాడి కంటే ఐదేళ్లు చిన్నగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి చిన్న వయసు ఉన్న అమ్మాయిని చేసుకుంటే 60-70 ఏళ్ళు వచ్చేసరికి మగాళ్ల కోరికలు తగ్గిపోతాయి. దీనివల్ల కూడా అసంతృప్తి నెలకొంటుంది. అందుకే ఈ కోరికలను బ్యాలెన్స్ చేసుకునేందుకు వయసు వ్యత్యాసం సరిగా ఉండాలని అంటారు.
మరో కారణం ఏంటంటే, మగాడితో పోలిస్తే అమ్మాయిలు రెండు, మూడేళ్లు కంటే ముందుగానే పరిపక్వత చెందుతారు. అమ్మాయిలు 10 నుంచి 14 ఏళ్లకి పరిపక్వత చెందితే, అబ్బాయిలు 12 నుంచి 16 ఏళ్ల మధ్యలో పరిపక్వత చెందుతారు. వయసులో రెండేళ్లు చిన్నవారి అయినా, మానసికంగా మగవారితో పోలిస్తే సమానమే అని ఈ స్టడీస్ చెబుతున్నాయి. అందుకే బ్యాలెన్స్ చేయడం కోసం తక్కువ వయసున్న స్త్రీని ఇచ్చి వివాహం చేస్తారు. పాత రోజుల్లో వివాహాలు గమనిస్తే ఒక మహిళ 48 నుంచి 50 ఏళ్ల వయసుకి వచ్చేసరికి మోనోపాజ్ దశకు వస్తుంది. 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఆమె సంతానోత్పత్తి సామర్థ్యం, పునరుత్పత్తి సామర్థ్యం ఉత్తమంగా ఉంటాయి. ఆ తర్వాత సామర్థ్యం తగ్గిపోయి అండాశయంలో అండాలు తగ్గిపోతాయి.
Read also: అటు కొడుకు ఇటు తండ్రి రెండు జనరేషన్స్ లతో నటించిన పది మంది స్టార్ హీరోయిన్స్ !