Advertisement
ఆపిల్ వాచ్… ప్రపంచ మార్కెట్ లో దీనికి ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ వాచ్ కొనుగోలుదారుల 11 కోట్లకు పైగా ఉన్నట్లు తాజా నివేదిక ద్వారా వెళ్లడైంది. 2021 రెండో త్రైమాసికం ప్రకారం… ఆపిల్ వాచ్ షిప్పింగ్ విషయంలో… ముందంజలో ఉంది. గత ఏడాది ఇదే సమయంలో మార్కెట్లో ఆపిల్ వాచ్ విక్రయాలు బాగా పడిపోయాయి. దీనికి ముఖ్యమైన కారణం తక్కువ ధరలకే మంచి ఫీచర్లతో స్మార్ట్ వాచ్లు అందుబాటులోకి రావడం. దీంతో రెండిటికి మధ్య నెలకొన్న పోటీల్లో ఆపిల్ అమ్మకాల జోరు తగ్గింది. అయితే తర్వాత ఆపిల్ వాచ్ ల ప్రత్యేకతలు డిఫరెంట్.
Advertisement
2015 లో యాపిల్ వాచ్‌ని విడుదల చేసినప్పుడు, చాలా మంది దీనికి రౌండ్ డిస్‌ప్లే ఉంటుందని ఊహించారు. సాంప్రదాయ గడియారాలు వృత్తాకార ముఖాలను కలిగి ఉండటమే కాకుండా, గతంలో విడుదల చేసిన Moto 360 వంటి స్మార్ట్‌వాచ్‌లు కూడా రౌండ్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. కానీ ఆపిల్ మాత్రం దీర్ఘచతురస్రాకార ఫారమ్ ఫ్యాక్టర్‌ను ఎంచుకుంది. ఇలా దీర్ఘచతురస్రాకారంలో ఈ వాచ్ లను తయారు చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
Advertisement
#1 డిస్ ప్లే సౌలభ్యం
ఆపిల్ వాచ్ దీర్ఘచతురస్రాకారంలో ఉండటానికి మొదటి కారణం డిస్ ప్లే. ఆపిల్ వాచ్..మనం వాడేటు వంటి మొబైల్ ఆకారంలో ఉంటుంది. మన మొబైల్ దీర్ఘచతురస్రాకారంలో ఉండటం వల్లనే.. అన్ని ఆప్షన్లను చూడగలుగుతున్నాము. అదే మొబైల్ రౌండ్ గా ఉంటే అన్ని చూడలేము. ఆపిల్ వాచ్ లోనూ అదే ఫార్ములా వర్తిస్తుంది. ఆపిల్ వాచ్ రౌండ్ షేప్ లో ఉంటే.. అన్ని ఫీచర్లను చూడలేం. అదే దీర్ఘచతురస్రాకారంలో ఉంటే.. మనకు చాలా సౌకర్యంగా ఉంటుంది.
#2 ఫీచర్ల సౌలభ్యం
ఆపిల్ వాచ్ దీర్ఘ చతురస్రంలో ఉంటుంది. దీర్ఘ చతురస్రం అంటే… 4 సరళ భుజాలు మరియు 90 డిగ్రీలకు సమానమైన అన్ని కోణాలతో ఉంటుంది. అంటే ఒక ఆపిల్ వాచ్… నాలుగు మూలలు, పొడవు, వెడల్పు, అన్ని సమానంగా ఉంటాయి. దీని ద్వారా… వాచ్ లోని ఫీచర్లు.. అన్ని ఒకేసారి.. మొబైల్ తరహాలో డిస్ ప్లే అవుతాయి. వాచ్ లో స్పేస్ వృధా కాదు. అదే.. రౌండ్ అకారం వాచ్ లో అన్ని ఫీచర్లు డిస్ ప్లే కాలేవు. అందుకే ఆపిల్ వాచ్ ను దీర్ఘ చతురస్రం ఆకారంలో డిజైన్ చేశారు.
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?