Advertisement
కే రాఘవేంద్రరావు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆయన అందరికీ సుపరిచితమే. ఆయన ఎంత గొప్ప దర్శకులో మనకి తెలుసు. రొమాంటిక్ కామెడీ ఫాంటసీ మెలోడీ ఇలా అన్ని జోనర్లు చేశారు. 100కి పైగా సినిమాలు చేసారు. బాబు అనే సినిమాతో 1975లో మొట్టమొదటిసారి దర్శకుడిగా మారారు ఇందులో ఒక లవర్ బాయ్ ఉంటాడు. అతను ప్రేమించడానికి ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఎలాగోలా 100 రోజులు సక్సెస్ఫుల్గా ఆడింది. ఈ మూవీకి కేఎస్ ప్రకాష్ రావు స్టోరీని అందించారు. ఈ సినిమాలో లవర్ బాయ్ గా శోభన్ బాబు నటించారు.
Advertisement
ఈ మూవీలో హీరో జమీందారీ కుటుంబంలో పుడతాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అతను టైలర్ అవుతాడు. టైలర్ అయినా సరే లవర్ బాయ్ గా ఉంటాడు చాలా చక్కగా డ్రెస్ వేసుకుంటాడు. హుందాగా కనపడతాడు అయితే ఈ సినిమాలోనే కాదు అన్ని సినిమాల్లో కూడా రాఘవేంద్రరావు హీరోలను చాలా రిచ్ గా మంచి దుస్తులతో కనిపించేలా చేస్తారు. రాఘవేంద్రరావు ఫస్ట్ సినిమాలోని మంచి మార్కులు కొందరు ఈ సినిమా కాస్త సాగదీతగా అనిపిస్తుంది కానీ రాఘవేందర్రావు మాత్రం 100% ఎఫర్ట్ పెట్టారు.
Advertisement
Also read:
ఈ సినిమాలో హీరో వేషధారణ చూస్తే నిజ జీవితంలో టైలర్ అనేవాడు ఇలా ఉంటాడని ఆశ్చర్యపోతారు. ఈ దర్శకుడు సినిమాలో లారీ డ్రైవర్, జేబుదొంగ, సామాన్య గైడ్ కూడా ఎంతో హుందాగా కనబడతారు. ఒకసారి ఈ ప్రశ్నను విలేకరు ఆయనను అడిగారు సినిమానే ఒక కల్పన దానికి నిజజీవితంలో ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి వాళ్లు నిజజీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. అవి మార్చేసి వారిని సంతోషంగా రిచ్ గా చూపిద్దామని అన్నారు. అలాగే ఇక్కడ కూడా అలా బతకకూడదు అని కొంతమంది ఏడుస్తుంటారు అలా వారి వేషధారణ చూసి ఏడుపు చూపించడం మంచిది కాదని కోరికలు తీరని ఒక లారీ డ్రైవర్ తనని హీరోలా చూసుకుని సంతోషంగా ఫీల్ అవుతాడని ఆయన చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!