Advertisement
ప్రపంచ కప్ మ్యాచ్లలో కాకుండా ఇప్పుడు జరుగుతున్న ఐపిఎల్ 2023 మ్యాచ్లలో కూడా అంపైర్లు చేతికి ఒక చిన్న బ్యాటు తరహా పరికరంను పెట్టుకుని ఉంటున్నారు. దీనిని ఆర్మ్ గార్డ్ అంటారు. ఆ బ్యాట్ తరహా పరికరంలో కెమెరా ఉంటుందని కొందరు, స్పీకర్ ఉంటుందని మరికొందరు రకరకాలుగా భావిస్తున్నారు. అయితే ఆ పరికరంలో అవేవీ ఉండవు. ఆ పరికర ఉద్దేశం అంపైర్ రక్షణ.
Advertisement
Read also: పెళ్లి తరువాత భార్య, భర్త ఎందుకు బరువు పెరిగిపోతారు ? 5 కారణాలు ఇవేనా ?
\
అవును అంపైర్ కు అత్యవసర సమయాల్లో అది ఉపయోగపడుతుందన్నమాట. అంపైర్ కు అత్యవసర పరిస్థితులు ఎందుకు వస్తాయని మీరు అనుకుంటున్నారు కదా. అప్పుడప్పుడు బ్యాట్స్మెన్ కొట్టిన బాల్స్ అంపైర్స్ మీదకు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనేందుకు అంపైర్స్ దీన్ని అడ్డుగా పెడతారన్నమాట.
Advertisement
Read also: పెళ్లి తరువాత భార్య, భర్త ఎందుకు బరువు పెరిగిపోతారు ? 5 కారణాలు ఇవేనా ?
కొన్ని సంవత్సరాల క్రితం ఒక క్రికెట్ మ్యాచ్ లో అంపైరింగ్ నిర్వహిస్తున్న అంపైర్ బంతి బలంగా తాకడంతో చనిపోయిన విషయం తెలిసిందే. అంపైర్లు ఎంతగా తప్పించుకుందాం అనుకున్నా కొన్నిసార్లు వీలుపడదు. అందుకే ప్రముఖ అంపైర్ అయినా బ్రూస్ ఆక్సేన్ ఫోర్డ్ ఈ పరికరంను కనిపెట్టాడు. బ్యాట్స్మెన్ ఉపయోగించే సేఫ్టీ పరికరాలను అంపైర్ ఉపయోగించలేడు. 2015 నుండి ఈ పరికరంను అంపైర్లు వాడడం జరుగుతుంది. దీన్ని వాడడం వాడకపోవడం అనేది అంపైర్ల ఇష్టం.
Read also: “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?