Advertisement
శ్రావణ మాసంలో ఆకుకూరలు తినకూడదని పెద్దలు అంటూ ఉంటారు. అయితే అసలు శ్రావణమాసంలో ఎందుకు ఆకుకూరలు తినకూడదు..? శ్రావణమాసంలో ఎందుకు నిషేధించబడింది అనే దాని గురించి చూద్దాం. మత విశ్వాసాల ప్రకారం పచ్చిపాలు, పెరుగును, శివునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అందువలన పచ్చిపాలను, పాలతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం ఈ నెలలో నిషేధించబడుతుంది. అలానే హిందూ మతానికి చెందిన పూజ నియమాల ప్రకారం వెల్లుల్లి, ఉల్లి వంటి తామసిక ఆహారం తినకూడదు. పురాణాల ప్రకారం శివుడు శ్రావణమాసంలో తన అత్తమామల ఇంటికి వెళ్లాడని నమ్ముతారు.
Advertisement
అక్కడ అతనికి గొప్ప వైభవంగా ఘన స్వాగతం పలికి అభిషేకం చేశారని పురాణాల్లో చెప్పబడింది. శ్రావణమాసంలో పరమశివుడు పార్వతి దేవి భూమిపై నివసిస్తారని అందుకే ఈ నెలలో పూజలు చూస్తే కోరికలు నెరవేరుతాయి అని నమ్మకం. ఈ నెలలో ఆకుకూరలు మాత్రమే కాదు. కొన్ని ఆహారపదార్దాలను తినడం కూడా మంచిది కాదు. మత విశ్వాసాల ప్రకారం పచ్చిపాలు శివుడికి నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి తీసుకోకూడదు.
Advertisement
Also read:
ఆకుకూరలు ఎందుకు తినకూడదు అనే విషయానికి వస్తే.. శివుడు కోప్పడతాడని విశ్వాసం ఆకుకూరలు తినొద్దు అంటారు. మతపైన కారణాలతో పాటుగా శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి శ్రావణమాసంలో ఆకుకూరల్లో పిత్తాన్ని పెంచే అంశాలు అధికంగా ఉంటాయి ఇవి జీర్ణక్రియలో సమస్యల్ని కలిగిస్తాయి. ఎక్కువ వర్షం కురుస్తుంది కాబట్టి ఈ వర్షం కారణంగా ఆకుకూరల్లో కీటకాలు గుడ్లు పెడతాయి. అటువంటి పరిస్థితులు ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. శివుడికి ప్రకృతి అంటే ఇష్టం అని అందుకని ఆకుకూరలని ఈ నెలలో తీసుకోవద్దని కూడా అంటారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!