Advertisement
విమానాల్లో వెళ్లేటప్పుడు కొన్ని వస్తువుల్ని తీసుకువెళ్లకూడదు. కొన్ని వస్తువుల్ని కనుక తీసుకెళ్లినట్లయితే అనవసరంగా చిక్కుల్లో పడతారు. విమాన ప్రయాణం ఈజీగా ఉంటుంది దూర ప్రయాణాలు కూడా ఈజీగా విమానాల్లో చెయ్యొచ్చు. ధర ఎక్కువ అయినప్పటికీ ఫాస్ట్ గా మనం అనుకున్న స్థానానికి వెళ్లిపోవచ్చు. మన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. విమాన ప్రయాణంలో కొన్ని వస్తువులు నిషేధం అనే విషయం మనకి తెలుసు. విమానాల్లో కొబ్బరికాయలను తీసుకెళ్లొచ్చా..? ఈ ప్రశ్నకి సమాధానం చూద్దాం.
Advertisement
ఎండిన కొబ్బరిని విమానాల్లో అసలు తీసుకెళ్లకూడదు ఎందుకంటే ఎండుకొబ్బరిలో నూనె పదార్థం ఎక్కువ ఉంటుంది. మండే స్వభావాన్ని ఇది కలిగి ఉంటుంది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే కొబ్బరి త్వరగా మండిపోతుంది. దీంతో విమానంలో మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండు కొబ్బరిని విమానాల్లో తీసుకెళ్లడం మంచిది కాదు. ఇక పచ్చికొబ్బరి విషయానికి వస్తే.. దీనిని చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకు వెళ్ళచ్చు.
Advertisement
Also read:
ప్యాక్ చేయబడిన కొబ్బరిని అయితే తీసుకెళ్లొచ్చు. కంపెనీలు అన్నీ సేఫ్టీ ప్రమాణాలని పాటిస్తూ కొబ్బరిని ప్యాక్ చేస్తాయి. కాబట్టి ప్యాక్ చేయబడిన కొబ్బరి కి విమానాల్లో అనుమతి ఉంది. విమానాల్లో ఏమైనా లిక్విడ్స్ 100 ml వరకు తీసుకువెళ్ళడానికి అవుతుంది. ఆహార పదార్థాల విషయంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఊరగాయలు, బియ్యం, పప్పు దినుసులు వంటివి తీసుకెళ్లడానికి అనుమతి లేదు. డ్రై ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు ఇటువంటివి తీసుకెళ్లకూడదు. ఈ విషయాలను మీరు ముందే గమనిస్తే ప్రయాణాల్లో ఇబ్బంది ఉండదు.
తెలుగు న్యూస్ కోసం చూడండి!