Advertisement
మానవ సంబంధాలు ఎంతగా మెరుగు పడుతూ వస్తున్నా.. ఓ ప్రశ్న మాత్రం అలానే మిగిలిపోతుంది. అమ్మాయిలు ఎందుకు అమాయకులను దూరం పెట్టి.. చెడ్డవాళ్లకు దగ్గరవుతారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక చెడ్డ అబ్బాయి తన మనసులోని మాటను మాట్లాడటానికి భయపడడు. చాలా మంది అమ్మాయిలు ఈ విషయాన్నీ అట్ట్రాక్టీవ్ గా భావిస్తారు. మంచి అబ్బాయిలు అందరినీ మెప్పించడానికి ప్రయత్నిస్తే, చెడ్డ అబ్బాయిలు ఇతర వ్యక్తులు ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. వారు నిజాయితీగా మరియు ముందంజలో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదే వారిని ప్రత్యేకంగా చూపిస్తుంది.
Advertisement
బాడ్ బాయ్స్ వారి స్పష్టమైన సెడక్టివ్ స్వాగర్‌తో ఆకర్షణీయంగా ఉంటారు. ఇది అమ్మాయిలను వారి పట్ల అట్ట్రాక్టీవ్ గా ఉండేలా చేస్తుంది. వాస్తవికంగా ఈ బిహేవియర్ ను తట్టుకోవడం కష్టమైనా… ఆకర్షణ ముందు అవన్నీ కనబడవు. తరచుగా, అమ్మాయిలు తమ వద్ద లేని వాటి పట్ల ఆకర్షితులవుతారు. బాడ్ బాయ్స్ బిహేవియర్ లో ఉండే అతి ధైర్యం, ధీమా వంటివి చూసి అట్ట్రాక్ట్ అవుతారు. ఇంకా అడ్వెంచరస్ గా ఉండాలనుకునే వారు కూడా అట్ట్రాక్ట్ అవుతూ ఉంటారు.
Advertisement
బాడ్ బాయ్స్ అలవాట్లు ఎలా ఉన్నా వారు తమ భాగస్వామి పట్ల ప్రొటెక్టీవ్ గానే ఉంటారు. ఈ స్వభావమే అమ్మాయిలకు మరింత నచ్చుతుంది. వారి డామినేషన్, నమ్మకం కలిగించే విధానం కూడా అమ్మాయిలను అట్ట్రాక్ట్ చేస్తుంది. వారిలో ఉండే నాయకత్వ లక్షణాలకు కూడా అమ్మాయిలు ఫిదా అవుతూ ఉంటారు. ఇంకా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలకు పూర్తిగా క్లారిటీ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు. దాని వలన కూడా వారి అటెన్షన్ అబ్బాయిలపై మరింత ఎక్కువగా ఉంటుంది. మంచి వ్యక్తితో చేసే డేటింగ్ బోరింగ్ గా ఫీల్ అయ్యే అమ్మాయిలు చెడ్డ అబ్బాయిలకు అట్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Read More:
అమ్మాయిలు తమ పార్టనర్ ని ఎందుకు మోసం చేస్తారు? ఈ కారణాలని చూడండి!