Advertisement
ట్రైన్ లో ట్రావెల్ చేయడం చాలా బాగుంటుంది. అందుకే చాలామంది దూర దూర ప్రాంతాలకు వెళ్లాలంటే, ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రైళ్లలో నిత్యం వేలాది మంది ప్రయాణికులు వారి గమ్య స్థానానికి చేరుకోవడానికి ప్రయాణాలు చేస్తారు. రైలుకి సంబంధించిన చాలా విషయాలు చాలా మందికి తెలియదు. నిజానికి రైలుకి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. రైలు మీద ఉండే గుర్తులు కానీ రైలు కిటికీల గురించి కానీ ట్రాకుల గురించి.. ఇలా చాలా విషయాలు అప్పుడప్పుడు మనకి కనబడుతూ ఉంటాయి.
Advertisement
ఇవాళ మరొక ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం. చాలామందికి ఈ విషయం తెలిసి ఉండదు. పాసింజర్ రైళ్లని చూసినట్లయితే చివర భోగి వెనకాల ఎక్స్ గుర్తు ఉంటుంది. అయితే మిగిలిన కొన్ని రైళ్లకి మాత్రం ఆ విధంగా x గుర్తు ఉండదు. అయితే అసలు ఈ గుర్తు ఏంటి..? ఈ గుర్తు ఎందుకు రైలు భోగి చివర ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. మరి మీకు కూడా ఈ విషయం తెలియక పోయినట్లయితే వెంటనే చూసేయండి.. రైలు ప్రమాదాల నివారణలో భాగంగా భారతీయ రైల్వే కొన్ని రకాల గుర్తులు, సింబల్స్ ని పెట్టడం జరిగింది.
Advertisement
ఎక్స్ గుర్తు కూడా ఒకటి. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే x గుర్తు భోగి రైలు చివరి భోగి. ఈ ఎక్స్ గుర్తు ఉన్న భోగి కనుక కనపడకపోయినట్లయితే ఏదో ప్రమాదం జరిగిందని ట్రైన్ నుండి బోగీలు విడిపోయాయి అని భావిస్తారు. అప్పుడు సంబంధిత అధికారులకు సమాచారాన్ని ఇస్తారు. కానీ వందే భారత్ రైలుకు చూస్తున్నట్లయితే ఈ గుర్తు ఉండదు. ఇది హై స్పీడ్ ట్రైన్ కాబట్టి అంతా అటాచ్ చేసి ఉంటుంది. రెండు వైపుల నుండి కూడా ఈ ట్రైన్ వెళుతుంది. అందుకనే ఈ గుర్తు వందే భరత్ ట్రైన్ కి కనపడదు.
Also read: