Advertisement
పెళ్లి అయ్యి కేవలం మూడు నెలలే అయింది. భర్తని దారుణంగా ఆమె చంపేసింది. తర్వాత దానిని ఆ$త్మ$హ$త్య కింద మార్చింది. అంత్యక్రియలను జరిపించడానికి ప్రయత్నం చేసింది కానీ బంధువులకి అనుమానం వచ్చింది. దీంతో జరిగింది మొత్తం బయటికి వచ్చింది. పూర్తి వివరాలు లోకి వెళితే.. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం లో చిగురువాడలో ఆదివారం ఇది చోటు చేసుకుంది. వెదురు కుప్పం మండలం తిప్పి నాయిని పల్లికి చెందిన గోవిందు 28 తో మానస 24 తో మూడు నెలల కిందట పెళ్లయింది.
Advertisement
అప్పటికే ఆమెకి ఇంకొక యువకుడి తో ప్రేమ వ్యవహారం ఉందని గోవిందు బంధువులు చెప్తున్నారు కానీ ఆ విషయం బయటకు రాకుండా మానస దాచిపెట్టి, గోవిందు ని పెళ్లి చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని మానస భర్త అడ్డంకి తొలగించుకోవడానికి సినిమాటిక్ రేంజ్ లో ప్లాన్ చేసింది. మంచి సమయం కోసం ఎదురు చూసింది గతంలో ఒకసారి హ$త్య$కి పాల్పడగా, అది విఫలమైనట్లు సమాచారం. శనివారం రాత్రి గోవిందు నిద్రలో ఉన్నాడు. ప్రియుడు సహాయం తో అతని గొంతు నులిమి ఊపిరాడకుండా చేసింది.
Advertisement
ఆ తర్వాత అప్పుల బాధతో ఆ$త్మహ$త్య చేసుకున్నట్లు నమ్మించే విధంగా ప్రయత్నం చేసింది భర్త మృతదేహాన్ని వెదురుకుప్పంలోని తిప్పనాయని పల్లి కి తరలించింది కుటుంబ సభ్యులు అతని మెడ మీద ఉన్న గాయాలని గుర్తించారు అనుమానంతో పోలీసుల కి కంప్లైంట్ చేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పో$స్ట్మా$ర్టం నిమిత్తం ఆస్పత్రి కి తీసుకెళ్లారు ఊపిరాడకుండా చేయడం వలనే గోవిందు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మానసని అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు పెళ్లయిన మూడు నెలలకి గోవిందు చనిపోవడంతో విషాదఛాయలు గ్రామంలో అలుముకున్నాయి. మానస తెలివిగా సినిమా రేంజ్ లో ప్లాన్ చేసింది కానీ ప్లాన్ ఫెయిల్ అయింది మొత్తం జరిగిందంతా బయటకి వచ్చింది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!