Advertisement
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదంలో చాలామంది అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు. అతివేగం నిర్లక్ష్యం మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా పలు కారణాల వలన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు దుఃఖంలో మునిగిపోతున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంతరం చేస్తున్న కూడా నిత్యం ఎక్కడో అక్కడ వాహనదారులు పొరపాట్లు చేయడం ప్రాణాలను కోల్పోవడం చూస్తున్నాము. పాలకొండ రూరల్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. తన కుటుంబాన్ని భర్త సింహాద్రి ఒక్కడే పోషిస్తూ వస్తున్నాడు.
Advertisement
Advertisement
తన భర్తకి సహాయంగా కష్టపడాలని నిర్ణయం తీసుకుంది కుమారి అయితే మండలంలోని పనుకువలస సమీపంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఆమె పని చేస్తోంది ఆదివారం కంపెనీలో పని ఉండడం వలన రోజులనే వెళ్ళింది. తనతో పాటు ఆ కంపెనీలో పని చేస్తున్న శ్రీరామ్ మూర్తి అనే వ్యక్తి ద్విచక్ర వాహనం మీద వెళుతున్న టైం లో రాజుపేట వద్దకు రాగానే రోడ్డుమీద హఠాత్తుగా ముంగిస అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేయడంతో పడిపోయింది ఈ ప్రమాదంలో కుమారి పక్కనే ఉన్న రాళ్ళ మీద పడి తలకి తీవ్ర గాయం అవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకుంది.
వెనుక ఆటోలో వస్తున్న ఆమె సహ ఉద్యోగులు గమనించి వెంటనే కుమారుని ఆటోలో పాలకొండ ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు శ్రీరామ్ మూర్తికి స్వల్ప గాయాలతో బయటపడగా కుమారి పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం ఆసుపత్రికి రిఫర్ చేశారు డాక్టర్లు. అక్కడ చికిత్స పొందుతూ కుమారి చనిపోయింది. ఆమెకి ఇద్దరు కొడుకులు. ఎంతో సంతోషంగా ఉన్న తన కుటుంబం లో విషాదం నిండడం తో కుటుంబ సభ్యులు మాత్రమే కాదు గ్రామస్తులు కూడా కంటతడి పెట్టుకున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!