Advertisement
టాలీవుడ్ లో ఉన్న యంగ్ యాక్టర్స్ లో హీరో సుహాస్ ఒకరు. ఈయన నటించిన తాజా చిత్రం గొర్రె పురాణం. బాబీ దర్శకత్వంలో, ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా గత నెల సెప్టెంబర్ 20న విడుదల అయింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ను ఓటిటిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోవడంతో ఓటిటిలో విడుదల చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. సినిమా లో ఒక జంతువు నే ప్రధాన పాత్రధారిగా పెట్టుకుని ఎంతో అద్భుతంగా సినిమాను విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా తాను భిన్నమైన కథలను ఎంచుకుంటానని మరొకసారి హీరో సుహాస్ నిరూపించడం జరిగింది.
Advertisement
ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీడీలో విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారం గా ప్రకటించింది. అయితే ఎప్పుడు స్ట్రీమింగ్ కు తీసుకొస్తారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు అక్టోబర్ 6వ తేదీన ఓటిటిలోకి రావచ్చని సమాచారం లేదా అక్టోబర్ 11న తప్పకుండా రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా కథ మొత్తం ఒక గొర్రె చుట్టూ తిరుగుతుంది. బక్రీద్ పండగ కోసం రఫిక్ అనే వ్యక్తి గొర్రె ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు, పండుగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆ గొర్రె తప్పించుకొని పారిపోతుంది.
Advertisement
Also read:
అయితే దాన్ని పట్టుకోడానికి ప్రయత్నించగా ఒక హిందూ ఆలయంలోకి వెళ్తుంది. దాంతో పోచమ్మ తల్లి ఈ గొర్రెను పంపింది అని నరసింహ అనే వ్యక్తి ఆలయంలోనే బలి ఇవ్వాలని చెబుతాడు. చివరకు రెండు మతాల వారు గొర్రె కోసం గొడవకు దిగుతారు. అయితే ఈ వీడియో వైరల్ గా మారుతుంది, దాంతో పోలీసులు గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తారు. దాని గురించి ఎలాంటి తీర్పు వస్తుంది? మాత్రాల మధ్య ఏ విధంగా ఒక గొర్రె చిచ్చు పెట్టింది? ఈ గొర్రె అంత వైరల్ కావడానికి కారణాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా గొర్రె పురాణం సినిమా చూడాల్సిందే.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!