Advertisement
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. నాంపల్లిలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయం నుంచి అభ్యర్థులు భారీగా ర్యాలీగా బయలుదేరి టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపారు. వేల సంఖ్యలో కార్యాలయం వద్దకు తరలిరావడంతో వారిని అడ్డుకునేందుకు భారీగా పోలీసు బలగాలు మొహరించాయి.
Advertisement
పోలీసులు అభ్యర్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వెనక్కి తగ్గలేదు. మూడు గంటల పాటు అభ్యర్థుల ఆందోళన సాగింది. ప్రభుత్వానికి టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేసారు. గ్రూపు 2 పరీక్ష ఆగస్టు29, 30 తేదీలలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది టీఎస్పీఎస్సీ. ఆగస్టు 01న తేదీ నుంచి 23వ తేదీ వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన టీజీటీ, పీజీటీ పరీక్షలున్నాయి. ఒకే నెలలో రెండు పరీక్షలకు సిద్దమవ్వడం చాలా కష్టమని రెండు వేర్వేరు సిలబస్ అని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రూపు 2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. గతంలో ఉన్న సిలబస్ కి అదనంగా 70 శాతం కలిపారని పేర్కొంటున్నారు.
Advertisement
ముఖ్యంగా పేపర్ లీకేజీ సమస్యతో మూడు నెలల పాటు మానసిక ఆవేదనకు గురై సరిగ్గా చదవలేకపోయామని చెబుతున్నారు అభ్యర్థులు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూపు 2 ప్రతినిధుల బృందం అభ్యర్థులతో చర్చలు జరిపింది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ చైర్మన్ అందుబాటులో లేరని.. ఆయనతో చర్చించి పరీక్ష వాయిదా నిర్ణయంపై మూడు రోజులు సమయం కోరినట్టు తెలుస్తోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు