Advertisement
పాకిస్థాన్ పై మరపురాని విజయంతో టి20 వరల్డ్ కప్ ను టీమిండియా గ్రాండ్ గా ఆరంభించింది. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ కు హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో తో భారత్ ను గెలిపించారు. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించిన, ఎన్నో లోపాలు బయటపడ్డాయి. తుది జట్టు ఎంపికపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. బ్యాటింగ్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. పాకిస్తాన్ విధించిన 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో నాలుగో స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కు పంపించాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
Advertisement
దురదృష్టవశాత్తు అక్షర్ పటేల్ రనౌట్ కావడంతో ఈ ప్రయోగం ఫెయిల్ అయింది. దీంతో లెఫ్ట్ హ్యాండర్ రిషబ్ పంత్ ను తుది జట్టులో తీసుకోవాల్సిందని కొందరు వాధించారు. బౌలింగ్ లో కూడా కేవలం ఒక ఓవర్ మాత్రమే వేసిన అక్షర్, 21 పరుగులు సమర్పించుకున్నాడు. తర్వాత జరిగే మ్యాచ్ లో అయినా అక్షర్ స్థానంలో రిషబ్ ను టాప్-11 లోకి తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు.
Advertisement
నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి లభించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. నివేదిక ప్రకారం, ఈ మ్యాచ్ లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వనున్నారు. పిటిఐ నివేదిక ప్రకారం, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో అక్టోబర్ 27 నెదర్లాండ్స్ తో జరిగే సూపర్ 12 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ మ్యాచ్ కు ముందు కూడా హార్దిక్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనలేదు. దీంతో నెదర్లాండ్స్ తో మ్యాచ్ కి టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కానున్నట్లు తెలుస్తోంది. కాగా, పాక్ పై భారత్ విజయంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పై హార్దిక్ బంతితోను, బ్యాట్ తోను బాగా రాణించాడు. బౌలింగ్ లో మూడు వికెట్లు తీశాడు. అదే సమయంలో అతను బ్యాటింగ్ లో 40 పరుగుల కీలక ఇన్నింగ్స్ ను ఆడాడు.
READ ALSO : రైతుల పాదయాత్ర దుకాణం బంద్..త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన !