Advertisement
సిబిఎన్ అరెస్ట్ తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి గా ఉన్న నారా లోకేష్ ఈ శుక్రవారం నుంచి పాదయాత్రని ప్రారంభించాల్సి ఉంది. అయితే.. అంతలోపలే రాజమండ్రికి రావాలి అంటూ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సూచన చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు లోకేష్ అరెస్ట్ కి అన్నీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా వేసుకున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి: ఈసారి 175 స్థానాల్లోనూ వైసీపీ గెలిచి చూపిస్తుందా? జగన్ ధీమా వెనుక అసలు కారణం ఏంటి?
Advertisement
దీనితో లోకేష్ ను నిజంగానే అరెస్ట్ చేస్తారా? అన్న చర్చ మొదలైంది. ఈరోజు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పులు చేసి, వాటి ద్వారా లోకేష్ లబ్ది పొందారు అంటూ ఆయనపై అభియోగం మోపారు. దీనితో సిఐడి ఆయనను A – 14 చేర్చింది. దీనితో లోకేష్ ను ఢిల్లీ నుంచి రాగానే అరెస్ట్ చేస్తారు అని ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి: కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన నారా లోకేష్.. అంత భయం ఎందుకు అంటూ..?
మరో వైపు లోకేష్ మాత్రం ఇది కావాలనే చేస్తున్నారని, రాజకీయ ప్రేరేపిత కేసు అని పేర్కొంటున్నారు. అరెస్ట్ చేసాక బెయిల్ కోసం ప్రయత్నిస్తే ఆలస్యం అవుతుందన్న కారణంతోనే ముందుగా బెయిల్ పిటిషన్ అప్లై చేసారని తెలుస్తోంది.
మరిన్ని..