Advertisement
తెలంగాణలో డిసెంబర్ లో ఎన్నికలు జరుగనుండటంతో ఇప్పటి నుంచి అభ్యర్థులు తమ సీటును ఖరారు చేసుకొని ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రసవత్త పోరు కనిపించే అవకాశముంది. అధికార పార్టీకి చెందిన చాలా మంది నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా తాండురు మాజీ ఎమ్మెల్యే పట్నం మహేంధర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వీడేందుకు సిద్ధమైనట్టు సమాచారం. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకుంటే రాజీనామా చేసి హస్తం గూటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.
Advertisement
Advertisement
చివరి ప్రయత్నంగా గులాబీ బాస్ దగ్గర లాబీయింగ్ చేస్తూనే అటు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై సొంతంగా ఇంటర్నల్ సర్వే కూడా చేయిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి వచ్చారు. కాంగ్రెస్ పెద్దలు కూడా పట్నం ఫ్యామిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యేగా పట్నం మహేంధర్ రెడ్డిని చేవెళ్ల ఎంపిగా సునిత మహేందర్ రెడ్డికి ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.
అయితే పట్నం నరేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి కోడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అన్నతో పాటు కాంగ్రెస్ పార్టీకి వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. పట్నం మహేంధర్ మాత్రం టికెట్ దక్కకుంటే పార్టీ మారడం ఖాయం అనేది తాజా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పెద్దలు తాండూరు పై ఏది తేల్చలేకపోవడం అటు పట్నం కి ఇబ్బందిగా మారుతుందట. గులాబీ బాస్ ఇలాగే సాగదీస్తే ఓ మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.