Advertisement
సాధారణంగా ప్రతీ ఒక్కరూ ప్రతీ రోజు అన్నం తింటుంటారు. అన్నం తింటే బరువు పెరిగిపోతారని కొందరూ అంటుంటారు. నిజంగా అన్నం తింటే బరువు పెరిగిపోతారా..? బరువు తగ్గేందుకు అన్నం పూర్తిగా దూరం పెట్టేస్తే ఉపయోగం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. చాలామంది బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు అన్నం తినడం మానేస్తారు. పూర్తిగా అన్నం తినడం మానేసి మిగిలిన ఆహార పదార్థాలను తింటుంటారు.
Advertisement
వాస్తవానికి అన్నం మన సంస్కృతిలో భాగం. అన్నం తినడం వల్ల కడుపు నిండిన భావన మనకు కలుగుతుంటుంది. అన్నం పూర్తిగా మానేయడం వల్ల చర్మం జుట్టు జీర్ణ వ్యవస్థ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి అన్నం మానేయడం మంచిది కాదు.. స్థానికంగా దొరికే ఏ బియ్యం అయినా కూడా ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తున్నాయి. పూర్వికుల నుంచి ఎలాంటి ఆహారపు అలవాట్లు వచ్చాయో అవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే.
Advertisement
రాత్రిపూట తక్కువ తినడం ఉదయం పూట ఎక్కువ తినడం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అన్నంతో పాటుగా కూర పప్పు ఇవన్నీ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు బరువు తగ్గాలనుకుంటే లైట్ గా తీసుకోవాలి తప్ప పూర్తిగా అన్నం మానేయడం వలన బరువు తగ్గొచ్చు అనేది నిజం కాదు. ఆరోగ్యంగా ఉండాలని అనుకునే వాళ్ళు కచ్చితంగా సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు కూరగాయలు ఆకుకూరలు వంటివి కచ్చితంగా తీసుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు మీ దరి చేరకుండా ఉంటాయి.