Advertisement
సాధారణంగా చాలామందికి అనసపండు అంటే ఏమిటో తెలియదు. పైనాపిల్ అంటే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ప్రకృతిలో దొరికే పలాలలో పనసపండు చాలా అద్భుతమైన ఫలం. ఇందులో అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అనసపండులో ఉండే విటమిన్ సి రైబోప్లావిన్, పొటాషియం,కాపర్,మాంగనీస్ వంటి కణజాలలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండేటువంటి పొటాషియం రక్తప్రసరణ సక్రమంగా జరిపేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శరీర భాగాలకు ప్రాణవాయువుని కూడా అందిస్తాయి.
Advertisement
రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరానికి హాని చేసే ఇన్ఫెక్షన్ నుండి మనల్ని కాపాడతాయి. అనసపండులో ఉండే విటమిన్ ఏ మరియు బీటా కెరటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకాలు కళ్లకు చాలా మంచిది. అంతేకాకుండా విటమిన్ సి కంటెంట్ చాలా విలువైనది. శరీరంపై ఏర్పడే గాయాలను చర్మ సమస్యలను సత్వరం తగ్గిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం గుండె వేగాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. రక్తపోటు రాకుండా కాపాడుతుంది.కాపర్ రక్త కణాల అభివృద్ధికి సహాయాపడుతుంది. అనస పండులో ఉండే బ్రోమిలైన్ అనే ఎంజైయ్ తీసుకున్న ఆహారాన్ని ప్రోటీన్లుగా మార్చి జీర్ణం చేస్తుంది. దీనివల్ల అజీర్తికి ఇది ఒక చక్కని మందు అని చెప్పవచ్చు.
Advertisement
అంతేకాకుండా సైనటీస్ గొంతు నొప్పి వంటి శ్వాస కోస వ్యాధులను పైనాపిల్ తగ్గిస్తుంది. అనసపండులో ఉండే విటమిన్ సి అన్ని రకాల నోటి సమస్యలను నివారిస్తుంది. పంటి వ్యాధులను, చిగుళ్ల వాపులను, చిగుళ్ల నుంచి రక్తం కారాటాన్ని తగ్గిస్తుంది. ఆనసపండ్ల రసాన్ని గొంతులో పోసుకొని పుక్కిలించడం ద్వారా గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా పైనాపిల్ రసాన్ని తీసుకోవడం వల్ల చర్మం నిగారింపు పెరుగుతుంది. పైత్యం, వికారం వంటి వాటిని తగ్గిస్తుంది. ఉబ్బరం, కడుపునొప్పి,ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి. ఆహారంతో పాటు పొరపాటున కూడా కడుపులోకి ప్రవేశించిన కేశాలను కూడా కరిగిస్తుంది.
also read: