Advertisement
ఈ మధ్య దొంగలు.. దొంగతనం చేసేందుకు చాలా టెక్నిక్స్ వాడుతున్నారు. సినిమాలు చూసి, అలాగే ఇతర టెక్నికల్ దారుల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ దొంగతనానికి మహిళలు కూడా పాల్పడడం గమనార్హం. అయితే తాజాగా లక్నోలో ఓ వింత దొంగతనం చోటుచేసుకుంది. ఒక మహిళ బ్లాక్ కళ్ళజోడు, మాస్క్ ధరించి బంగారం షాప్ కు వెళ్ళింది.
Advertisement
దీంతో ఆ షాప్ ఓనర్.. ఆమెకు రకరకాల నెక్లెస్ మోడల్ లను చూపించాడు. అయితే ఆమె తెలివిగా ఒక మోడల్ నెక్లెస్ ను చూస్తున్నట్లుగా పక్కనే ఉన్న మరో నెక్లెస్ బాక్స్ ను క్లోజ్ చేసి, ఆ బాక్స్ పై తాను చూస్తున్న నగల బాక్స్ ను పెట్టింది. ఆ తర్వాత షాప్ వాడు, గమనించడం లేదనుకొని డిసైడ్ అయ్యాక నెమ్మదిగా తన ఒడిలో పెట్టుకున్నట్లుగా పెట్టుకుని, ఆ క్లోజ్ చేసి ఉన్న నగల బాక్స్ ను చీర మడతల్లో తెలివిగా దాచింది.
Advertisement
అ ఆ తర్వాత తనకు ఏం నగలు నచ్చట్లేదన్నట్లుగా కామ్ గా పైకి లేచి వెళ్లిపోయింది. అయితే ఉన్న షాప్ అతను…ఆమె ఏం కొనకుండా ఎందుకలా వెళ్లిపోయిందని కూడా అనుమానించలేదు. ఆమె మాత్రం భలే గమ్ మత్తుగా 10 లక్షలు ఖరీదు చేసే చెవిపోగులతో పాటు నెక్లెస్ బాక్స్ తో జంప్ అయిపోయింది. ఈ సంఘటన నవంబర్ 17వ తేదీన లక్నో సమీపంలోని గోరక్ పూర్ లో జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని మీరు కూడా ఒకసారి చూసేయండి.
Caught On CCTV: How Woman Stole Necklace Worth Lakhs In Busy UP Store https://t.co/YyJ9BZNpCt pic.twitter.com/GAZ7vJ8jYx
— NDTV (@ndtv) November 28, 2022